రామాయణంలో సాయిపల్లవి.. నమ్మొచ్చా?
రామాయణంలో సాయిపల్లవి సీత పాత్రను పోషించనుందట. రాముడిగా ఏమో రణబీర్ కపూర్ నటిస్తాడట. రావణుడి పాత్రకు ఎంపికైన నటుడి పేరు విన్నా ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. ఆ పేరే.. యశ్.
By: Tupaki Desk | 4 Oct 2023 3:36 AM GMTఅల్లు అరవింద్ సహ నిర్మాతగా బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి దర్శకత్వంలో రామాయణం అంటూ నాలుగైదేళ్ల నుంచి వార్తలు వింటూనే ఉన్నాం. 500 కోట్లతో ఈ సినిమా తీయబోతున్నట్లు మొదట్లో ప్రకటన వచ్చినపుడు అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమా ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఎంతకీ ముందుకు కదలట్లేదు. కాస్టింగ్ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తున్నాయి. తర్వాత అతీ గతీ లేకుండా పోతోంది. ఇప్పుడు కొత్తగా మళ్లీ రామాయణం కాస్టింగ్ గురించి సమాచారం బయటికి వచ్చింది. ఈసారి దక్షిణాది విలక్షణ కథానాయిక సాయిపల్లవి ఈ మెగా మూవీలో భాగమవుతున్నట్లు చెబుతుండటం విశేషం.
రామాయణంలో సాయిపల్లవి సీత పాత్రను పోషించనుందట. రాముడిగా ఏమో రణబీర్ కపూర్ నటిస్తాడట. రావణుడి పాత్రకు ఎంపికైన నటుడి పేరు విన్నా ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. ఆ పేరే.. యశ్.
సాయిపల్లవి లాంటి గొప్ప నటి సీత పాత్రలో నటిస్తే ఆ క్యారెక్టర్ వేరే లెవెల్‌కు వెళ్తుందనడంలో సందేహం లేదు. ఇక రణబీర్ కపూర్ కూడా రాముడి పాత్రకు బాగానే సూటవుతాడు. యానిమల్ లాంటి వయొలెంట్ సినిమా తర్వాత అతను రాముడి పాత్ర చేస్తే ఎలా ఉంటుందన్నదే ప్రశ్న. ఇక కేజీఎఫ్‌లో వీర విధ్వంసం సృష్టించిన యశ్ రావణుడి పాత్రలో కనిపిస్తే అది కూడా చాలా స్పెషల్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. వినడానికి ఈ కాస్టింగ్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. కానీ రామాయణ గాథతో తెరకెక్కిన అదిపురుష్ ఎలాంటి ఫలితాన్నందుకుందో తెలిసిందే. మరి ఈ స్థితిలో భారీ బడ్జెట్ పెట్టి మళ్లీ రామాయణం తీస్తారా అన్నది డౌట్. కాకపోతే ఆదిపురుష్ సరిగా తీయకపోవడం వల్ల తేడా కొట్టింది కానీ.. ఆ కథలో ఉన్న బలమే వేరు. సరిగ్గా తీస్తే మంచి ఫలితమే రావచ్చు. కానీ ఇలా ఎంత కాలం సినిమా వార్తలకే పరిమితం అవుతుంది.. ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందన్నదే ప్రశ్న.