Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి వాళ్ల కోసం వెయిటింగ్ బాస్!

అందుకే ఎంత మంది కొత్త భామ‌లొచ్చినా ఆమెకి పోటీ కాద‌నే చెప్పాలి.

By:  Tupaki Desk   |   9 July 2024 1:30 AM GMT
సాయి ప‌ల్ల‌వి వాళ్ల కోసం వెయిటింగ్ బాస్!
X

నేచుర‌ల్ పెర్పార్మ‌ర్ సాయిప‌ల్ల‌వి ఎంత‌టి ప్ర‌తిభావంతురాల‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. క‌టౌట్ కాక‌పోయినా త‌న‌లో ఉన్న కంటెంట్ తో రాణిస్తోన్న న‌టి. అందుకే ఎంత మంది కొత్త భామ‌లొచ్చినా ఆమెకి పోటీ కాద‌నే చెప్పాలి. నెంబ‌వ‌ర్ వ‌న్ రేసులో ఎంత‌మంది హీరోయిన్లు ఉన్నా! సాయి ప‌ల్ల‌వికంటూ ప్ర‌త్యేక మైన ట్రాక్ వేసుకుని ముందు కెళ్తుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంది.

డీసెంట్ పాత్ర‌లే పోషిస్తుంది. అందులోనూ న‌ట‌న‌కు ఆస్కారం ఉండాలి. ఇలా త‌న‌కంటూ కొన్ని నియ‌మ నిబంధ‌నలున్నాయి. అందుకు త‌గ్గ అవ‌కాశాలే అమ్మ‌డు అందుకుంటుంది. తాజాగా సాయి ప‌ల్ల‌వి పోషించా లనుకుంటోన్న పాత్రల గురించి స్పందించింది. `ఇప్ప‌టివ‌ర‌కూ క‌థా ప్రాధాన్య‌మున్న చిత్రాలు, పాత్ర‌లే చేసాను. అవ‌న్నీ నాకు నాలో ఉన్న డాన్సు ట్యాలెంట్ ప‌రంగానూ మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

కానీ వీటికి భిన్న‌మైన పాత్ర‌లు పోషించాల‌ని ఉంది. మంచి కామెడీ నేప‌థ్య‌మున్న సినిమాలు చేయాల‌ని ఉంది. అందులోనూ ద‌ర్శ‌కులు నాతో కామెడీ పండించ‌గ‌ల‌గాలి. ఇంత‌వ‌ర‌కూ అలాంటి పాత్ర‌లు పోషించే అవ‌కాశం రాలేదు. ఇకపై వ‌స్తే మాత్రం కాద‌న‌కుండా చేస్తాను. న‌టిగా అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించి న‌ప్పుడే సంపూర్ణ న‌టిగా రిటైర్ అవ్వ‌గ‌లం. చేసిన పాత్ర‌లే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తే బోరింగ్ గా ఉంటుంది. ఇక‌పై పాత్ర‌ల ప‌రంగా మ‌రింత సెల‌క్టివ్ గా ఉంటాను` అని తెలిపింది.

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి ఫుల్ బిజీగా ఉంది. నాగ‌చైత‌న్య తో తండేల్ సినిమాలో న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. `ఆమ‌ర‌న్` అనే త‌మిళ సినిమా చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో లాంచ్ అవుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క `రామ‌య‌ణ్` సినిమాలో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న న‌టిస్తోంది. మ‌రో అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్ లోనూ న‌టిస్తుంది.