సాయిపల్లవి కూడా సై అనేసిందా!
మరి తాజాగా అమ్మడు ఆ పరిమితుల్లో కొన్నింటిని సడలించిందా? తాను సైతం రొమాన్స్ కి రెడీ అంటోందా? అంటే అవుననే వినిపిస్తుంది.
By: Tupaki Desk | 27 Feb 2024 5:30 PM GMTసాయిపల్లవి అంటే డీసెంట్ రోల్స్ కి పెట్టింది పేరు. 'ఫిదా' నుంచి 'విరాట పర్వం'..'గార్గీ' వరకూ ఆమె ఎలాంటి పాత్రలు పోషించిందో తెలిసిందే. నటిగా ఆస్కారం ఉన్న పాత్రతో పాటు ఎలాంటి అసభ్యతకు ఛాన్స్ లేని పాత్రలే చేసింది. తెరపై రొమాంటిక్ గా నటిస్తేనే చూస్తారా? అందంగా నటిస్తే చూడరా? అన్న దానికి కొత్త మీనింగ్ ని పరిచయం చేసింది పల్లవి. కేవలం తన నటన..ప్రతిభతోనే ఇంతకాలం డీసెంట్ పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ..గుర్తింపును దక్కించుకుంది. దశాబ్ధం కెరీర్ లో సాయి పల్లవి రొమాంటిక్ పాత్రలు పోషించింది అన్నది ఎక్కడా కనిపించదు.
కనీసం గాసిప్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా పాత్రల విషయంలో అంత కేర్ పుల్ ఉగా ఉంది కాబట్టే అది సాధ్యమైంది. కోట్ల రూపాయాల పారితోషికంతో ఆమెని మధ్యపెడదాం అని చాలా మంది దర్శక-నిర్మాతలు ప్రయత్నం చేసారు గానీ అందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదు. పాత్రల విషయంలో తనకంటూ కొన్ని పరి మితులు విధించుకునే ఇంత కాలం పనిచేసింది. మరి తాజాగా అమ్మడు ఆ పరిమితుల్లో కొన్నింటిని సడలించిందా? తాను సైతం రొమాన్స్ కి రెడీ అంటోందా? అంటే అవుననే వినిపిస్తుంది.
ఓ సినిమా కోసం సాయి పల్లవి తన బౌండరీని దాటి బయటకు వస్తుందిట. ఇంతకీ ఏ సినిమా ఆమెని అంతగా డిమాండ్ చేసిందంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరియార్ స్వామి 'అమరన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోకి భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇందులో సాయి పల్లవి ఓ రొమాంటిక్ గీతంలో నటించాల్సి వస్తోందిట. కథతో పాటు ఆ పాట సాగుతుందిట. ఇందులో భార్య పాత్ర రొమాంటిక్ గా డిమాండ్ చేయడంతో సాయి పల్లవి దర్శకుడు అడగగానే నో చెప్పకుండా ఒకే చెప్పిందిట.
రొమాంటిక్ సాంగ్ లో భాగంగా హీరోకి అతి దగ్గరగా నటించాల్సి ఉంటుందని దర్శకుడు కోరగా అంగీక రించిందిట. కేవలం క్లోజ్ గా ఉండే సన్నివేశాలు తప్ప అంతకు మించి ఇంటిమేట్ సన్నివేశాలు లాంటివి ఉండవని...అలాగే పెదవి ముద్దులకు అసలే ఛాన్స్ లేదని ముందే పల్లవి చెప్పేసిందిట. అన్ని రకాలుగా ఆమెకి అనుకూలంగా ఉంటేనే వాటిలో నటిస్తానని చెప్పిందిట. త్వరలో చెన్నైలో జరిగే చివరి షెడ్యూల్ లో ఆ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరించనున్నారని తెలిసింది.