Begin typing your search above and press return to search.

సాయిపల్లవి - చంద్రముఖి 2.. మ్యాటరెంటి?

15 ఏళ్ళ క్రితం రజినీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:24 AM GMT
సాయిపల్లవి - చంద్రముఖి 2.. మ్యాటరెంటి?
X

15 ఏళ్ళ క్రితం రజినీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఇది ప్యూర్ రీమేక్ మూవీ. మలయాళంలో శోభన, సురేష్ గోపి కాంబినేషన్ లో వచ్చిన మణిచిత్రతాజు ఒరిజినల్ వెర్షన్. అదే సినిమాని పి వాసు 2004లో కన్నడంలో ఆప్తమిత్రగా విష్ణువర్ధన్, సౌందర్య కాంబినేషన్ లో చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దానినే రజినీకాంత్ తో 2005లో చంద్రముఖిగా తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో జ్యోతిక మరో లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆప్తమిత్రకి సీక్వెల్ గా ఆప్తరక్షక 2010లో వచ్చింది. దాన్ని మళ్ళీ తెలుగులో వెంకటేష్ తో నాగవల్లిగా రీమేక్ చేశారు. ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. స్టోరీ పెద్దగా లేకపోవడంతో వర్క్ అవుట్ కాలేదు.

అయితే మళ్ళీ ఇప్పుడు పి వాసు లారెన్స్ తో చంద్రముఖి 2 తెరకెక్కించి పాన్ ఇండియా లెవల్ లో సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో కనిపించబోతోంది. కన్నడ, తెలుగు భాషలలో చేసిన సీక్వెల్స్ వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్ళీ కొత్తకథ సిద్ధం చేసి చంద్రముఖి 2 సీక్వెల్ చేశారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే చంద్రముఖి తరహాలోనే అదే ఇంట్లో 15 ఏళ్ళ తరువాత జరిగిన కథగా దీనిని చూపిస్తున్నారు. క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా వరకు మొదటి చిత్రం తరహాలోనే ఉన్నాయి. చంద్రముఖి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారంట. అయితే ఆమె ఎందుకనో తిరస్కరించింది. దీంతో ఏకంగా కంగనా రనౌత్ ని రంగంలోకి దించేశారు.

ఆమె రాకతో మూవీ బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ కారణంగా పాన్ ఇండియా చిత్రంగా రిప్రజెంట్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే అంత గొప్పగా ఏమీ లేదు. కానీ కీరవాణి మ్యూజిక్ సినిమాకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి. సాయి పల్లవి ఈ చిత్రాన్ని రిజక్ట్ చేసి సరైన నిర్ణయమే తీసుకుందని మాట ట్రైలర్ చూసిన వారు అంటున్నారు. మరి మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందనేదానిపై ఆమె నిర్ణయం కరెక్ట్, రాంగ్ అనేది తెలియనుంది.