Begin typing your search above and press return to search.

అందుకే సాయి పల్లవి చాలా స్పెషల్

సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సాయి పల్లవి.

By:  Tupaki Desk   |   6 Aug 2024 10:45 AM GMT
అందుకే సాయి పల్లవి చాలా స్పెషల్
X

సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సాయి పల్లవి. హీరోయిన్ గా ఆమె సినిమాలు ఫెయిల్ అయిన కూడా నటిగా మాత్రం సాయి పల్లవి ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. తాను చేసిన ప్రతి సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. నిజానికి సాయి పల్లవి స్టోరీ మొత్తం విన్న తర్వాత తన పాత్ర నచ్చితేనే చేయడానికి ఒప్పుకుంటుంది. ఈ జెనరేషన్ లో ఇటు డాన్స్, అటు యాక్టింగ్ పరంగా బెస్ట్ యాక్టర్స్ జాబితా చూసుకుంటే సాయి పల్లవి టాప్ లో ఉంటుంది.

ఏ భాషలో సినిమా చేసిన తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలకి ఆమె ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందంట. స్టార్ ఇమేజ్ ఉంది కదా అని భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయదంట. డబ్బు కంటే ఆమె ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే సాయి పల్లవి చాలా సెలక్టివ్ గానే మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యకి జోడీగా తండేల్ మూవీలో చేస్తోంది. అలాగే హిందీలో రామాయణంలో సీతగా నటించనుంది.

ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి వ్యక్తిత్వం గురించి అప్పుడప్పుడు నిర్మాతలు కూడా గొప్పగా చెబుతూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో ఆమె గురించి కథనాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో పడిపడిలేచి మనసు సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ ఈ చిత్రంలో హీరో.

లవ్ స్టోరీని డిఫరెంట్ గా హను రాఘవపూడి చెప్పే ప్రయత్నం చేశారు. కథ బాగున్న ఎందుకనో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. దీంతో మూవీ డిజాస్టర్ అయ్యింది. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకి నష్టాలు మిగిల్చింది. అయితే ఈ మూవీ లాస్ రావడంతో సాయి పల్లవి తన పూర్తి రెమ్యునరేషన్ పూర్తిగా తీసుకోలేదంట. కొంత మాత్రమే తీసుకొని మిగిలింది వదిలేసిందంట.

ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. హీరోలు తమ రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడం లేదంటే వదులుకోవడం సాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ని చాలా సార్లు తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. హీరోయిన్స్ మాత్రం ముందుగానే రెమ్యునరేషన్ మొత్తం తీసేసుకుంటారు. సాయి పల్లవి మాత్రం వారికి చాలా భిన్నమైన వ్యక్తి. అందుకే సాయి పల్లవిని టాలీవుడ్ లో అందరూ లేడీ పవన్ కళ్యాణ్ అని అంటూ ఉంటారు. ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.