Begin typing your search above and press return to search.

లేడీ పవర్ స్టార్ ఆ స్టార్ కి వీరాభిమాని..!

సినీ పరిశ్రమలోకి ఎంతోమంది కథానాయికలు ఎంట్రీ ఇస్తుంటారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 2:30 AM GMT
లేడీ పవర్ స్టార్ ఆ స్టార్ కి వీరాభిమాని..!
X

సినీ పరిశ్రమలోకి ఎంతోమంది కథానాయికలు ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయితే మరికొందరు కొన్ని సినిమాలు చేసి ఫెడవుట్ అవుతారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. హీరోయిన్ అవ్వడానికి ముందే డ్యాన్సర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించిన సాయి పల్లవి మలయాళంలో నటించిన ప్రేమం సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే సాయి పల్లవి నటించిన తొలి సినిమానే ప్రేమం అనుకుంటారు కానీ అమ్మడు అంతకుముందే రెండు సినిమాల్లో నటించింది.


ప్రేమం సినిమా కన్నా ముందు కస్తూరీ మాన్, ధామ్ ధూమ్ సినిమాల్లో నటించింది సాయి పల్లవి. ఐతే ఆ సినిమాల్లో చిన్న పాత్రల్లో సాయి పల్లవి నటించింది. ఆ తర్వాత ఆమెకు నవీన్ పౌలి నటించిన ప్రేమంలో ఛాన్స్ వచ్చింది. కెరీర్ లో ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎన్ని మంచి పాత్రల్లో నటించామన్నది ముఖ్యం అనుకునే వారిలో సాయి పల్లవి ఒకరు. సక్సెస్ ఫుల్ కెరీర్ లో దూసుకెళ్తున్న సాయి పల్లవి రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.


సాయి పల్లవి రోజు ఎలా మొదలు పెడుతుందో తెలుసా.. నిద్రలేచిన తర్వాత సాయి పల్లవి తన కోసం కొంత టైం కేటాయిస్తుందట. అంటే కాసేపు యోగా, ధ్యానం చేస్తుందట. యోగా చేయడం వల్ల హెల్త్ బాగుంటుందని ధ్యానం వల్ల ఎలాంటి ఒత్తిడైనా సరే దరిచేరదని అంటుంది సాయి పల్లవి. ఇక తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన సాయి పల్లవి కోలీవుడ్ స్టార్ సూర్య పై తన అభిమానాన్ని వెల్లడించింది. ఆయనకు తాను వీరాభిమానని.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని.. ఐతే ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తుందని ఊహించలేదు. ఎన్.జి.కే సినిమా టైం లో సూర్య గారితో ఫస్ట్ డే షూటింగ్ ఆయన నా పక్కన నిలబడినప్పుడు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యిందని అన్నారు సాయి పల్లవి.

ఇక తను మొదటిసారి చికెన్ వండిన విషయం గురించి వెల్లడించింది సాయి పల్లవి. ఫస్ట్ నుంచి వెజిటేరియన్స్ అవ్వడం వల్ల నాన్ వెజ్ గురించి విన్నాను తప్ప ఎలా వండుతారో తెలియదు. అలాంటిది తాను మొదటిసారి చికెన్ చేయాల్సి వచ్చింది. షాప్ కి వెళ్లి చికెన్ తెచ్చి దాన్ని శుభ్రం చేసి మసాలాలన్నీ వేసి వంట చేశా.. వేరే ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నా.. ఐతే ఆ కర్రీ పూర్తయ్యాక అనవసరంగా ఒక ప్రాణిని చంపానే అని బాధపడ్డా. ఐతే ఎవరికోసం అయితే అది చేశానో వారు ఆనందించారని అన్నారు సాయి పల్లవి. ఆ తర్వాత చికెన్ వెండటం కూడా మానేశా అని అన్నారు.

ఫిదా తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఐతే ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటునారు సాయి పల్లవి. ఫిదా పోస్టర్ ఫస్ట్ టైం ఫిదా పోస్టర్ చూశాకే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. షూటింగ్ లో పాల్గొన్న ఫస్ట్ డే నే ఆడియో లాంచ్ కల్లా తెలుగు మాట్లాడాలని అనుకున్నా అలానే అనుకున్నట్టుగా మాట్లాడా అని చెప్పారు సాయి పల్లవి. ఫిదా సినిమాతో ఫిలిం ఫేర్ అవార్డ్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. నా కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఫిదా అందుకే ఆ సినిమాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు.

ప్రేమం షూటింగ్ సెట్ లోనే అందరు టీ ఇస్తుంటే ట్రై చేద్దామని సాయి పల్లవి ఫస్ట్ టైం ఆ సెట్ లో టీ తాగానని చెప్పారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్న సాయి పల్లవి తొలి సినిమా ఎప్పటికీ మర్చిపోనని అంటుంది. ఫిదా సినిమాలో నటించినందుకు ఆమెకు 10 లక్షలు ఇచ్చారట.