సాయిపల్లవి మీద ఇదో రకం కుట్ర?
ఇప్పుడు ఈ ప్రతిభావనిపై అలాంటి ఒక కుట్ర ఒకటి బయటపడింది. ఇటీవల ఒక వార్త వైరల్ గా మారింది
By: Tupaki Desk | 7 Feb 2024 2:59 AM GMTట్యాలెంటెడ్ సాయిపల్లవి మీద కుట్ర జరుగుతోందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. తనదైన నట ప్రతిభ, డ్యాన్సింగ్ ఎబిలిటీతో ఇప్పటికే అగ్ర నాయికలకే చెమటలు పట్టించిన సాయిపల్లవి కచ్ఛితంగా రేస్ లో చాలా మందికి పోటీదారు. అందువల్ల తనపై ఏదో ఒక కుట్ర చేసేందుకు ఎవరో ఒకరు సిద్ధంగానే ఉంటారనేది ఊహించగలం.
ఇప్పుడు ఈ ప్రతిభావనిపై అలాంటి ఒక కుట్ర ఒకటి బయటపడింది. ఇటీవల ఒక వార్త వైరల్ గా మారింది. సాయిపల్లవిని నితీష్ తివారీ రామాయణం సినిమా నుంచి తొలగించారని, సీత పాత్రను సాయిపల్లవికి బదులుగా జాన్వీ కపూర్ కి ఆఫర్ చేసారని హిందీ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదని తాజాగా తేలింది. అవన్నీ కేవలం గాసిప్పులు మాత్రమే. సాయిపల్లవికి జాన్వీ ఎప్పటికీ రీప్లేస్ మెంట్ కాలేదు. అందం తెలివి తేటలు ఎన్ని ఉన్నా కానీ సాయిపల్లవి ట్యాలెంట్ ముందు ఎవరైనా దిగదుడుపే. ఈ విషయంలో నితీష్ తివారీ లాంటి సీనియర్ దర్శకుడు పూర్తి క్లారిటీతో ఉన్నారు. సాయిపల్లవి అయితేనే సీత పాత్రకు గొప్ప వన్నెలు అద్దినట్టు అని ఆయన భావిస్తున్నారట. మీడియాలో హల్ చల్ చేస్తున్న ఇలాంటి తప్పుడు కథనాలను అస్సలు నమ్మొద్దని కూడా చెబుతున్నారట.
ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం వాస్తవ వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే రామాయణంలోని ప్రధాన తారాగణం లాక్ అయిందని చిత్రబృందానికి సన్నిహితంగా ఉన్న కొన్ని సోర్సెస్ ధృవీకరించాయి. ''రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా, సన్నీ డియోల్ హనుమాన్‌గా..యష్ రావణుడిగా కనిపించనున్నారు. వీళ్లతో పాటు సాయి పల్లవి సీతగా నటించడం కూడా ఫిక్సయింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం మార్చి 2024లో సెట్స్‌పైకి వస్తుంది'' అని తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ప్రమేయం గురించి ప్రశ్నించగా.. ''ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. స్వార్థపరులైన కొందరు వ్యక్తులు మీడియాలో పరిశ్రమలో కాస్టింగ్ గురించి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సీత పాత్ర కోసం జాన్వీ కపూర్‌ను ఎప్పుడూ సంప్రదించలేదు. అలియా భట్ - సాయి పల్లవి మధ్య మాత్రమే పరిశీలన సాగింది.. కానీ సాయిపల్లవి ఫిక్సయింది'' అని క్లారిటీ గా చెప్పారు. రామాయణం మొదటి భాగం దీపావళి 2025 వారాంతంలో విడుదల అవుతుంది. మేకర్స్ జూలై 2024 నాటికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ చేస్తారని తెలిసింది.