చెల్లి పెళ్లి సరే.. సాయి పల్లవి పెళ్లాడేదెపుడు?
తనదైన డ్యాన్సింగ్ స్టైల్, అద్భుత నటప్రతిభతో మెస్మరైజ్ చేసే సాయి పల్లవికి ఒక చిట్టి చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 16 Jan 2024 9:52 AM GMTతనదైన డ్యాన్సింగ్ స్టైల్, అద్భుత నటప్రతిభతో మెస్మరైజ్ చేసే సాయి పల్లవికి ఒక చిట్టి చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ గురించి అభిమానులకు తక్కువ సమాచారం ఉంది. తాజాగా పూజాపై మీడియాలో జోరుగా కథనాలొస్తున్నాయి. సాయి పల్లవి గారాల సిస్టర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినీ పరిశ్రమలోనే పూజా కన్నన్ నటిగా కొనసాగుతోంది. దీనికి మించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా గుర్తింపు పొందింది. పూజా కన్నన్ తమిళనాడు కోటగిరిలో 21 ఏప్రిల్ 1997న జన్మించారు. కోయంబత్తూరులోని SSVM సంస్థలలో పాఠశాల విద్యను పూర్తి చేసి, అటుపై G.R.D నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అదే నగరంలో కళాశాల చదువులు పూర్తి చేసింది.
పూజా కన్నన్ 2017లో అజిత్ దర్శకత్వం వహించిన 'కారా' అనే షార్ట్ ఫిల్మ్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2021లో 'చిత్తిరై సెవ్వానం' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అప్పటి నుండి లో ప్రొఫైల్‌ను మేనేజ్ చేసతూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచింది.
అయితే పూజా కన్నన్ ఇటీవల సోషల్ మీడియాలో ఇచ్చిన హింట్.. తన పెళ్లి గురించి ఊహాగానాలకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో పూజా కన్నన్ తన ప్రియుడు వినీత్‌ను పరిచయం చేసింది. అతడిపై తనకున్న ప్రేమను ప్రశంసల రూపంలో వ్యక్తం చేసింది. అతడిని తన 'సూర్యకాంతి కిరణం' అని 'నేరంలో భాగస్వామి' అని కూడా సరదాగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు నా భాగస్వామి అంటూ మురిపెంగా చెప్పుకుంది. పూజా కన్నన్ పెళ్లి సంగతి తెలిసిన అభిమానులు, అనుచరులు తనను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. వినీత్ ని పూజా త్వరలో వివాహం చేసుకుంటారని ఊహాగానాలు ప్రారంభించారు. పూజా కన్నన్ సోదరి సాయి పల్లవి కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? అనే చర్చకు ఇది దారితీసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సాయి పల్లవి ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి 'తండేల్' అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలో శివ కార్తికేయన్ సరసన నటించనుంది. ప్రస్తుతానికి పూజా కన్నన్ వివాహం గురించి పుకార్లు షికార్ చేస్తున్నాయి. అభిమానులు అధికారిక నిర్ధారణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.