మళ్లీ 'ఫిదా' చేసే ప్రయత్నం నిజమేనా...?
తెలుగు ప్రేక్షకులను 'ఫిదా' చేసిన వరుణ్ తేజ్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబో మళ్లీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు
By: Tupaki Desk | 25 May 2024 6:39 AM GMTతెలుగు ప్రేక్షకులను 'ఫిదా' చేసిన వరుణ్ తేజ్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబో మళ్లీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించి మళ్లీ ఫిదా చేసింది. అయితే వరుణ్ తేజ్ తో కలిసి శేఖర్ కమ్ముల సినిమా చేయలేదు.
లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో కుబేరా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కుబేరా సినిమా భారీగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
శేఖర్ కమ్ముల కుబేరా సినిమా తర్వాత చేయబోతున్న సినిమా విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తో శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఫిదా సినిమాలో వరుణ్ ను కమ్ముల చూపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.
వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కాంబోలో రాబోతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుంది అనే చర్చ అప్పుడే మొదలు అయ్యింది. అయితే హీరోయిన్ విషయంలో సెంటిమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్.
వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాను చేస్తున్నాడు. అతి త్వరలోనే మట్కాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. మొత్తానికి ప్రస్తుతం వరుణ్ మరియు శేఖర్ కమ్ముల లు చేస్తున్న ప్రాజెక్ట్ లు పూర్తి అయిన వెంటనే కాంబో మూవీ తో ఫిదా చేయడం నిజమే అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది.