Begin typing your search above and press return to search.

బుజ్జ‌మ్మ‌ని స‌ర్ ప్రైజ్ ల‌తో ముంచేస్తున్నారుగా?

నాగ‌చైత‌న్య మాస్ లుక్...పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ స‌న్నివేశాలు వంటివి ఎంతో ఆస‌క్తిక రంగా మ‌లిచిన‌ట్లు క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   18 July 2024 6:09 AM GMT
బుజ్జ‌మ్మ‌ని స‌ర్ ప్రైజ్ ల‌తో ముంచేస్తున్నారుగా?
X

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థ‌నాయ‌కుడిగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'తండేల్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర‌ మ‌త్స‌కారుల జీవితంలో జ‌రిగిన కొన్ని వాస్త‌వం సంఘ‌ట‌న‌ల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కి స్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. నాగ‌చైత‌న్య మాస్ లుక్...పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ స‌న్నివేశాలు వంటివి ఎంతో ఆస‌క్తిక రంగా మ‌లిచిన‌ట్లు క‌నిపిస్తుంది.


పాకిస్తాన్ గ‌డ్డ‌పై భార‌తీయుడు ధైర్య‌సాహ‌సాల్ని చందు హైలైట్ చేసిన విధానం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుం టుంది. దీంతో త‌దుప‌రి అప్ డేట్స్ కోసం అభిమానులు అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. వైజాగ్, ఉడిపి, హైద‌రాబాద్ లాంటి చోట కీల‌క స‌న్నివేశాలు చిత్రీక రించారు. స్టోరీ అంతా ఇక్క‌డి బ్యాక్ డ్రాప్ లోనే ముడిపడి ఉండ‌టంతో ఔట్ డోర్ షూటింగ్ అవ‌స‌రం ప‌డ‌లేదు. అవ‌స‌రం మేర పాకిస్తాన్ జైళ్లు, అక్క‌డి లొకేష‌న్ల‌కు సంబంధించిన సెట్లు వేసి చిత్రీక‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం తాజా షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క‌మైన టాకీ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదే సెట్స్ లో నిన్న‌టి రోజును సాయి ప‌ల్ల‌విని తండేల్ యూనిట్ స‌త్క‌రించింది. `విరాట ప‌ర్వం`,` గార్గి` చిత్రాల్లో సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు గానూ ఉత్త‌మ న‌టిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు రావ‌డంతో ఆమెని తండేల్ టీమ్ ఘ‌నంగా స‌న్మానించింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అలాగే మే లో జ‌రిగిన సాయి ప‌ల్ల‌వి పుట్టిన రోజు వేడుక‌ల్ని సైతం చిత్ర యూనిట్ అంతే ఘ‌నంగా నిర్వ‌హించింది. ఆఫ్ స్క్రీన్‌లో షూటింగ్ స్పాట్‌లో సాయి పల్లవి చేసే అల్లరి, హ్యాపీనెస్, చిలిపితనం ఇలా అన్నింటినీ చూపిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి విషెస్ తెలియ‌జేసారు. ఇందులో సాయి పల్లవి ఎంతో క్యూట్‌గా హైలైట్ అయింది. తండేల్ సినిమాలోనూ సాయి ప‌ల్ల‌వి డీగ్లామ‌ర్ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. బుజ్జ‌మ్మ పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి మెప్పించ‌నుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఆ పాత్ర లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.