ఇందుకే కదా సాయి పల్లవి అంటే పడిపోయేది!
ఎల్లో కలర్ సింపుల్ శారీలో గ్లామరస్ గా కనిపిస్తోంది సాయి పల్లవి. హెయిర్ లీవ్ చేసి.. తన నవ్వుతోనే మాయ చేస్తోంది నేచురల్ బ్యూటీ.
By: Tupaki Desk | 25 Jan 2024 8:22 AM GMTసినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. కానీ నేచురల్ యాక్టింగ్ తో డిఫరెంట్ ఫ్యాన్ బేస్, క్రేజ్, స్టార్ డమ్ సంపాదించుకున్న యాక్టర్లు మాత్రం తక్కువే. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది హీరోయిన్ సాయి పల్లవి. మెడిసిన్ పూర్తి చేసిన ఈ భామ డ్యాన్సర్ గా, నటిగా తన అందం, అభినయంతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
గ్లామరస్ రోల్ అయినా, ఇరగదీసే డ్యాన్స్ అయినా, పెర్ఫర్మాన్స్ ఓరియెంటెడ్ పాత్రలోనైనా ఈజీగా లీనమైపోయే టాలెంట్ సాయిపల్లవి సొంతం. మలయాళ హిట్ ప్రాజెక్ట్ ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా తొలి ఎంట్రీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ లుక్స్ కు పడిపోని మూవీ లవర్స్ ఉండరు.
ఇటీవలే సాయి పల్లవి చెల్లెలు పూజ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ వేడుకలో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వేడుకలో ఆమెకు సంబంధించిన మరో ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎల్లో కలర్ సింపుల్ శారీలో గ్లామరస్ గా కనిపిస్తోంది సాయి పల్లవి. హెయిర్ లీవ్ చేసి.. తన నవ్వుతోనే మాయ చేస్తోంది నేచురల్ బ్యూటీ. మేకప్ లేకుండా సింపుల్ స్టైల్ తో ఫిదా చేస్తోంది. సాయి పల్లవి పిక్ కు ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇంత అందంగా ఎలా పుట్టారని అడుగుతున్నారు. ఇందుకే కదా సాయి పల్లవి అంటే పడిపోయేదని కామెంట్లు పెడుతున్నారు.
ఇక తెలుగు సినీ ప్రియులు.. సాయి పల్లవిని ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ మనసు దోచుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ, గార్గి, విరాటపర్వం వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తోంది.
గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది సాయి పల్లవి. సినిమాల్లో మేకప్ తక్కువగా వేసుకుంటుంది. ఇక మరికొన్ని మూవీల్లో అసలు మేకప్ వేసుకోదు. అయినా సహజ సౌందర్యం ఆమె సొంతం. గ్లోమర్ డోస్ లేకుండానే అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటోంది. తన కొత్త సినిమా తండేల్ లో మరింత సింపుల్ లుక్ లో అందంగా కనిపించనుంది. అచ్చ పల్లెటూరి అమ్మాయిలా లంగాఓణీలో కనువిందు చేయనుంది.