అతడు రత్నం.. ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి.. రెహమాన్ భార్య!
దీనిని ఇప్పుడు సైరా బాను పూర్తిగా తప్పు పట్టారు. ఆయన మంచి వ్యక్తి. అతడిని తప్పు పట్టి కించపరిచే ప్రచారం చేయొద్దని తమిళ మీడియాలను యూట్యూబ్ చానెళ్లను సైరా బాను కోరారు.
By: Tupaki Desk | 24 Nov 2024 11:44 AM GMTలెజెండరీ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ - సైరా బాను జంట విడాకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బ్రేకప్ ఇటీవలి కాలంలో భారతీయ సినీపరిశ్రమలో షాకింగ్ పరిణామాలలో ఒకటి. ఉమ్మడి ప్రకటన అనంతరం తమకు గోప్యత కావాలని ఈ జంట వేడుకున్నారు. కానీ ఈ విడాకులకు కారణం రెహమాన్ కి ఇతర మహిళతో సంబంధం ఉందని కొన్ని తమిళ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు ప్రచారం చేసాయి.
దీనిని ఇప్పుడు సైరా బాను పూర్తిగా తప్పు పట్టారు. ఆయన మంచి వ్యక్తి. అతడిని తప్పు పట్టి కించపరిచే ప్రచారం చేయొద్దని తమిళ మీడియాలను యూట్యూబ్ చానెళ్లను సైరా బాను కోరారు. ``అతడి పేరును చెడగొట్టి, కించపరచడం ఆపండి.. ఇది పూర్తిగా చెత్త. అతడు ఒక రత్నం`` అంటూ రెహమాన్ పై తన ప్రేమను చాటుకున్నారు సైరా బాను. ``అతడు ఒక రత్నం.. ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి`` అని అన్నారు. నేను నగరంలో లేనని ప్రశ్నిస్తున్నారు.. నిజానికి నా ఆరోగ్య సమస్యల కారణంగానే చెన్నై వదిలి వెళ్లాల్సి వచ్చింది. చెన్నైలో తన బిజీ షెడ్యూళ్ల కారణంగా అది సాధ్యం కాదు.. అని సైరా బాను అన్నారు.
ప్రస్తుతం ముంబైలో ఉన్నానని అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నానని సైరా బాను వెల్లడించారు. అందుకే నేను AR (రెహమాన్) నుండి బ్రేక్ తీసుకున్నాను. అతడిపై చెడుగా ఏమీ మాట్లాడవద్దని మీడియాను అభ్యర్థిస్తున్నాను అని అన్నారు. నేను అతడిని నమ్ముతున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నానో అతడు కూడా అంతే. తప్పుడు ఆరోపణలను ఆపాలని కోరుతున్నాను. మేము ఒంటరిగా మిగిలిపోయామని ..మాకు స్పేస్ ఇవ్వమని దేవునికి హృదయపూర్వక ప్రార్థనలు`` అని సైరా అన్నారు.