మరో సాంగ్‌తో 'బేబీ' మాస్టర్ ప్లాన్.. అప్పటిలోగా పిండేసేందుకు
అయితే తాజాగా ఈ సినిమాలో మరో పాటను యాడ్ చేయబోతున్నట్లు దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా తెలిపారు
By: Tupaki Desk | 29 July 2023 5:51 AM GMTఓ సినిమాపై హైప్ పెంచేందుకు రకరకాల ప్రమోషన్స్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. అలాగే ఓ సినిమా హిట్ అయ్యాక కూడా.. ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ మళ్లీ రప్పించేందుకు అదనపు సన్నివేశాలను జోడిస్తుంటారు. ఇందులో భాగంగా సాంగ్స్, లేదా ఫైటింగ్ సీన్స్.. ఏదో ఒకటి జత చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు ఇలా చేశారు. ఇప్పుడు బేబీ చిత్రంలోనూ ఇదే చేయబోతున్నారు.
చిన్న సినిమాగా విడుదలైన బేబీ చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కలిసి నటించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటివరకు రూ.70 కోట్ల గ్రాస్ వరకు వసూళ్ళను సాధించింది. విడుదలై 15 రోజులు అవుతున్నా కలెక్షన్లు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో మరో పాటను యాడ్ చేయబోతున్నట్లు దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.
'చందమామ' అంటూ సాగే ఈ సాంగ్‌ను సింగర్ దీపు ఆలపించినట్లు సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. ఏడో పాటగా దీని జోడించబోతున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటి నుంచి యాడ్ అవ్వబోతుందనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పటికీ బ్రో రిలీజ్ వల్ల 'బేబీ' థియేటర్ల సంఖ్య కాస్త తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బ్రో కు డివైడ్ టాక్ రావడం వల్ల.. మళ్లీ బేబీ స్క్రీన్స్‌ను పెంచుకోనుంది.
అంటే ఈ వీకెండ్ అయిపోగానే బేబీ పికప్ మొదలవొచ్చు. అలాగే ఆగస్టు 4న విడుదల కావాల్సిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వాయిదా పడనుంది. ఇది కూడా సినిమాకు కలిసి వస్తుంది. కాబట్టి.. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు.. మూవీటీమ్ రెడీ అయింది. అందులో భాగంగానే సాంగ్‌ను రిలీజ్ చేయబోతోంది. అలాగే ఎడిటింగ్‌లో తొలగించిన ఓ 14 నిమిషాల సన్నివేశాన్ని జోడించబోతున్నట్టు ప్రచరా సాగుతోంది.
అంటే ఈ పాట కోసమైన మళ్లీ బేబీ లవర్స్ మరోసారి సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది. కాలేజీ స్టూడెంట్స్, యూత్, లవర్స్.. మళ్లీ ఇదే సినిమాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయి. ఎలాగో ఆగస్టు 10 వరకు ఎలాంటి బడా హీరోల సినిమాలు లేవు. ఆ తర్వాతే వరుసగా ఒక్కో పెద్ద హీరో రాబోతున్నారు. కాబట్టి.. ఈలోగా వీలైనంత పిండుకునేందుకు మూవీటీమ్ ప్రయత్నాలు చేస్తోంది.