Begin typing your search above and press return to search.

బేబీ 2 కథ రెడీ చేస్తున్న సాయి రాజేష్..!

బేబీ సినిమా ఆడియన్స్ లోకి బాగా వెళ్లింది. అందుకే బేబీ సీక్వెల్ గా బేబీ 2 చేయాలని అనుకుంటున్నారట సాయి రాజేష్.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:30 PM GMT
బేబీ 2 కథ రెడీ చేస్తున్న సాయి రాజేష్..!
X

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు తీసిన డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ లాంటి ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ తీస్తాడని ఎవరు ఊహించలేదు. ప్రజెంట్ జనరేషన్ ప్రేమకథలను రిప్రజెంట్ చేస్తూ సాయి రాజేష్ తీసిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమాలో నటించిన ఆనంద్, వైష్ణవి, విరాజ్ లు కూడా తమ కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు. బేబీ సినిమా నిర్మించిన ఎస్.కె.ఎన్ కి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. బేబీ చూసిన చిరంజీవి, అల్లు అర్జున్ ఈ సినిమాను తీసిన మేకర్స్ ని.. పనిచేసిన నటీనటులకు ప్రత్యేకంగా ఈవెంట్ పెట్టి మరి ప్రశంసించారు. బేబీ హిట్ ఇచ్చిన ప్రోత్సాహంతో సాయి రాజేష్ ఇక మీదట కూడా ఇలాంటి సినిమాలే చేస్తానని చెప్పారు.

బేబీ సినిమా ఆడియన్స్ లోకి బాగా వెళ్లింది. అందుకే బేబీ సీక్వెల్ గా బేబీ 2 చేయాలని అనుకుంటున్నారట సాయి రాజేష్. అయితే బేబీ లో వైష్ణవి, ఆనంద్, విరాజ్ ల కథ ముగిసింది. బేబీ 2 లో మరో లవ్ స్టోరీని టచ్ చేస్తారని తెలుస్తుంది. బేబీ 2 కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కథతోనే ఉంటుందని టాక్. సాయి రాజేష్ ఇప్పటికే బేబీ 2 లైన్ సిద్ధం చేశారని త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తారని చెబుతున్నారు.

బేబీ సినిమా యూత్ ఆడియన్స్ ని కదిలించింది. ఆ సినిమా చూసిన రియల్ లవర్స్ అంతా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా కొనసాగింపుగా బేబీ 2 ఉంటుందా బేబీ 2 కొత్త కథ ఉంటుందా అన్నది త్వరలో ఒక క్లారిటీ వస్తుంది. అయితే బేబీ 2 కొత్త కథతో వచ్చినా అందులో ఎక్కడో ఒకచోట బేబీ పాత్రదారులు ఆనంద్, వైష్ణవి, విరాజ్ లు కూడా కనిపిస్తారని తెలుస్తుంది.

ఇదే కాదు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే ఆనంద్, విరాజ్, వైష్ణవి లతోనే బేబీ 2 ఉంటుందని. పూర్తిగా మరో కొత్త కథతో బేబీ 2 ని సాయి రాజేష్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా బేబీ ఇచ్చిన బూస్టింగ్ తో సాయి రాజేష్ బేబీ సీరీస్ లతో ఫెయిల్యూర్ కథలన్నీ చెప్పాలని అనుకుంటున్నాడని అర్ధమవుతుంది. ఇదే నిజమైతే బేబీ 2తోనే ఇది ఆగదు బేబీ 3, 4 అలా కొనసాగుతూనే ఉంటాయని చెప్పొచ్చు. క్రైం థ్రిల్లర్ సీరీస్ ల లానే ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కథలన్నీ బేబీ పార్టులుగా మారితే అదిరిపోతుందని చెప్పొచ్చు.