Begin typing your search above and press return to search.

నేను బాగోను.. నల్లగా ఉంటాను! సాయి రాజేష్

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ల‌వ్ స్టోరీ సాయిరాజేష్ వ్య‌క్తిగ‌త ల‌వ్ స్టోరీ అని ప్ర‌చారం సాగుతోంది. దీన్ని ఆయ‌న ఖండిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   3 Aug 2023 7:12 AM GMT
నేను బాగోను.. నల్లగా ఉంటాను! సాయి రాజేష్
X

'బేబి' విజ‌యంతో యంగ్ డైరెక్ట‌ర్ సాయి రాజేష్ నెట్టింట మార్మోమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ ఎలా ఉంద‌న్న‌ది ప‌క్క‌న‌బ‌డితే ప‌రిమిత బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇంత‌వ‌ర‌కూ హిట్ లేని ఆనంద్ దేవ‌ర‌కొండ కెరీర్ లో తొలి హిట్ న‌మోదైంది. కొత్త‌వాళ్ల‌తో రాజేష్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి కూడా టీమ్ ప‌నిన‌త‌న్నా మెచ్చుకున్నారు. ఇక నిర్మాత అల్లు అర‌వింద్ బేబి టీమ్ కి ఏకంగా పార్టీ కూడా ఇచ్చారు.

ఆ పార్టీలో చాలా మంది ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఇలా ఒక్క విజ‌యంతో సాయి రాజేష్ లైఫ్ కొత్త ట‌ర్నీంగ్ తీసుకోబుతుంద‌ని చెప్పొచ్చు. ద‌ర్శ‌కుడిగా ఇక‌పై ఆయ‌న ఫుల్ బిజీ అయిపోతాడు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ల‌వ్ స్టోరీ సాయిరాజేష్ వ్య‌క్తిగ‌త ల‌వ్ స్టోరీ అని ప్ర‌చారం సాగుతోంది. దీన్ని ఆయ‌న ఖండిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'బేబి నా ల‌వ్ స్టోరీ కాదు..క‌ల‌ర్ ఫోటో నాలైఫ్ స్టోరీ. చివ‌రి 20 నిమిషాలు మిన‌హాయిస్తే మిగ‌తా స‌న్నివేశాలన్నీ నా జీవితం లో జ‌రిగిన‌వే. నా మనసు లో నేను అనుకున్న మాటల ను ఆ సినిమా లో సుహాస్ తో చెప్పించాను.

నేను-మా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ప‌దో త‌ర‌గ‌తి లోనే ప్రేమ‌లో ప‌డిపోయాం. ఇంట‌ర్మీడియ‌ట్ లో ఆ ప్రేమ మ‌రింత ముదిరింది. ఆస‌మ‌యం లో మా ఆవిడ‌ని ఎక్క‌డో దాచేసారు. అందువ‌ల్ల ల‌వ్ లో పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను బాగోను. న‌ల్ల‌గా ఉంటాను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాలో ఉండేది. అయినా మా ఆవిడ న‌న్ను ల‌వ్ చేసింది. ఆ పాయింట్ తోనే ఆ క‌థ పుట్టింది' అన్నారు.

మొత్తానికి సాయిరాజేష్ ల‌వ్ స్టోరీ లో కూడా చాలా చాలెంజ్ లు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్రేమ కోసం పోరాటాలు చేయ‌డం...ఛేజింగ్ లు గ‌ట్రా చేయ‌డం చేసే ఉంటారు. అదీ ఇంట‌ర్మీడియ‌ట్ లో అంటే ఉడుకు ర‌క్తం. ఏదైనా చేసేయాలి అన్న ఆవేశం ఉంటుంది. ఆ వేశంలోనే నిజ‌మైన క‌చ్చిత‌మైన ప్రేమ ఉంటుంది. ఇలాంటి వాటిని బేస్ చేసుకుని తేజ‌..'నువ్వు' నేను'..'చిత్రం'..'జ‌యం' లాంటి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'నువ్వు నేను'..'జ‌యం' సినిమాల్లో హీరోయిన్ ని దాచే స‌న్నివేశాలు రాజేష్ ల‌వ్ స్టోరీని మ‌రిపించేలా ఉన్నాయి.