Begin typing your search above and press return to search.

బికినీలో మాయ చేస్తోన్న హుషారు భామ

తెలుగమ్మాయిలు కూడా ప్రస్తుతం గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందించడానికి సిద్ధం అయిపోతున్నారు.

By:  Tupaki Desk   |   24 July 2024 5:29 AM GMT
బికినీలో మాయ చేస్తోన్న హుషారు భామ
X

తెలుగమ్మాయిలు కూడా ప్రస్తుతం గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందించడానికి సిద్ధం అయిపోతున్నారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఘాటైన ఫోటోషూట్ లతో సందడి చేస్తున్నారు. అలాగే తమ అందం, ఆకర్షణతో దర్శక, నిర్మాతలకి పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. ఎలాంటి పాత్ర చేయడానికి అయిన మేము సిద్ధం అనే గ్రీన్ సిగ్నల్ తెలుగు బ్యూటీస్ నుంచి వస్తున్నాయి.


అలాగే తెలుగమ్మాయిలు టాలీవుడ్ సినిమాలలో మంచి అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త భామలు తమ అందాలతో హీరోయిన్స్ గా ఛాన్స్ లు అందుకుంటూ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారిలో రమ్య పసుపులేటి కూడా ఒకరు. ఈ బ్యూటీ హుషారు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా సక్సెస్ తో తరువాత ఫస్ట్ ర్యాంకు రాజు సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.


నెక్స్ట్ మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ శ్రీకాంత్ లీడ్ రోల్ చేసిన చదరంగం వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే బిఎఫ్ఎఫ్ అనే వెబ్ సిరీస్ గత ఏడాది చేసింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ సినిమాల పరంగా మామూలు క్యారెక్టర్స్ చేసిన సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్ లని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. కుందనపు బొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ తన వయ్యారాలతో కుర్రాళ్ళని కనికట్టు చేస్తుందనే మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ బికినీ స్విమ్ షూట్ లో తడి అందాలతో సముద్రతీరంలో ఫోటోలకి ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంత అందం ఉంచుకొని కూడా రమ్య పుసుపులేటికి అంతంత మాత్రమే అవకాశాలు రావడం నిజంగా బాధాకరం అని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ తెలుగు హీరోయిన్స్ ని సరైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే స్టార్ హీరోయిన్స్ అయ్యే సత్తా ఉంటుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. రమ్య పుసుపులేటి గ్లామర్ బ్యూటీస్ ని ఎంకరేజ్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.