Begin typing your search above and press return to search.

తమ్ముడి కోసం అన్నయ్య ఆ పని చేస్తున్నాడా..?

అంతేకాదు వైష్ణవ్ కు మంచి కథ కావాలని రైటర్స్ తో చెబుతున్నాడట. తమ్ముడు సక్సెస్ కోసం అన్నయ్య సాయి తేజ్ కష్టపడుతున్నాడు.

By:  Tupaki Desk   |   20 July 2024 6:30 AM GMT
తమ్ముడి కోసం అన్నయ్య ఆ పని చేస్తున్నాడా..?
X

మెగా హీరోల్లో అన్నదమ్ములు ఇద్దరికీ కెరీర్ లో సంక్షోభం వచ్చి పడింది. విరూపాక్ష హిట్ పడినా బ్రో తో పెద్దగా ప్రభావం చూపించని సాయి తేజ్, సంపత్ నంది తో సినిమా అనుకోని ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని క్యాసిల్ చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ అనే నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఐతే ఈలోగా తమ్ముడు వైష్ణవ్ తేజ్ కోసం కూడా కథల వేట చేస్తున్నాడట సాయి తేజ్.

ఉప్పెన తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన 3 సినిమాలు అట్టర్లీ పోయాయి. ఉప్పెనతో వచ్చిన మార్కెట్ అంతా కూడా ఆ తర్వాత వచ్చిన మూడు ఫ్లాప్ సినిమాల వల్ల దెబ్బపడింది. అర్జెంట్ గా ఒక హిట్ సినిమా కోసం వైష్ణవ్ తేజ్ ఎదురుచూస్తున్నాడు. హిట్ కొట్టిన తర్వాత వరుస ఫ్లాపులు పడటం వల్ల కెరీర్ చాలా డిస్టర్బ్ గా అనిపిస్తుంది. ఈ టైం లో ఒక్క హిట్టు కొట్టి మళ్లీ కెరీర్ ని గాడిన పడేసుకోవాలని అనుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్.

అందుకోసం అన్న సాయి తేజ్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చిన కథలను తనకు సూట్ అవ్వకపోతే వైష్ణవ్ కి రిఫర్ చేస్తున్నాడట సాయి తేజ్. అంతేకాదు వైష్ణవ్ కు మంచి కథ కావాలని రైటర్స్ తో చెబుతున్నాడట. తమ్ముడు సక్సెస్ కోసం అన్నయ్య సాయి తేజ్ కష్టపడుతున్నాడు. చివరగా ఆది కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యుంటుందని ఫిక్స్ అయ్యాడు.

అందుకే ఈసారి కథా ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. సాయి తేజ్ కూడా తోడయ్యాడు కాబట్టి మెగా హీరోలు ఇద్దరు కలిసి ఒక మంచి కథ పిక్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ కథ ఏంటి.. వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది. మెగా అల్లుళ్ల కెరీర్ గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా కాస్త దిగులుగా ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ల సొంత నిర్ణయానికి వదిలేస్తున్నా అవసరం అనుకున్నప్పుడు చిరు కూడా రంగంలోకి దిగుతాడని చెప్పుకుంటున్నారు. ఇక చిరు వచ్చాడంటే మాత్రం సాయి తేజ్, వైష్ణవ్ లకు ఒక సూపర్ హిట్ పడినట్టే లెక్క అని చెప్పొచ్చు.