Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ సినిమాలో పాకిస్తాన్ బ్యూటీ!

ఇక హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని తీసుకుంటున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Aug 2024 6:14 AM GMT
ప్ర‌భాస్ సినిమాలో పాకిస్తాన్ బ్యూటీ!
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా పిరియాడిక్ వార్ బ్యాక్ డ్రాప్ లో హ‌న రాఘ‌వ‌పూడి ఓచిత్రానికి స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వార్ బ్యాక్ డ్రాప్ అయినా హ‌ను మార్క్ ల‌వ్ స్టోరీని సినిమాలో హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే లీకులందుతున్నాయి. 'సీతారామం' త‌ర్వాత మ‌రే సినిమా చేయ‌కుండా కేవ‌లం ప్ర‌భాస్ కోస‌మే కూర్చుని రాసుకున్న క‌థ ఇది. ఈసినిమాకే 'పౌజీ అనే టైటిల్ కూడా ప్ర‌చారంలో ఉంది.


ఇక హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని తీసుకుంటున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ నెల మూడ‌వ వారం లో సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుగుతుంద‌ని, నెలఖ‌రునుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని వినిపిస్తుంది. ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగానూ ఎంపికైన‌ట్లు వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైర‌ల్ అవుతుంది.

ఇందులో పాకిస్తాన్ న‌టి స‌జ‌ల్ అలీని తీసుకున్న‌ట్లు నిర్మాణ వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. అస‌లు మెయిన్ లీడ్కి తీసుకుంటుంది పాకిస్తాన్ న‌టిని అని, మృణాల్ సెకెండ్ లీడ్ అనే వార్త తాజాగా తెర‌పైకి వ‌స్తోంది. హ‌ను రాసుకున్న క‌థ‌కి, పాకిస్తాన్ కి బ‌ల‌మైన సంబంధం ఉందంటున్నారు. ప్ర‌భాస్ ప్లాష్ బ్యాక్ లో సిపాయి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ఇప్ప‌టికే లీకైంది. సిపాయిగా ఉన్న స‌మ‌యంలోనే పాకిస్తాన్ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ని, ఆ స‌న్నివేశాలు ఎంతో రొమాంటిక్ గా, హృద్యంగా ఉంటాయ‌ని అంటున్నారు.

అందుకే ప్ర‌త్యేకంగా లాహోర్ న‌టి స‌జ‌ల్ అలీని ఎంపిక చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. మ‌రి స‌జ‌ల్ అలీ ఎంపిక ప‌ట్ల వ్య‌తిరేక ఏదైనా వ్య‌క్త‌మ‌వుతుందా? అన్న‌ది చూడాలి. స‌జ‌ల్ అలీ మామ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అంత‌కు ముందు పాకిస్తాన్ లో కొన్నిసినిమాలు చేసింది. ముఖ్యంగా టెలివిజ‌న్ షోల‌తో స‌జల్ అలీ ఎంతో ఫేమ‌స్. కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ న‌టించింది.