Begin typing your search above and press return to search.

పాక్ బ్యూటీ స‌రే! దాయాది దేశంలో స్టార్ అయ్యేదెలా?

ప్రపంచవ్యాప్తంగా ప్ర‌భాస్ కి ఫాలోయింగ్ ఉంది. ఇండియా, చైనా, జ‌పాన్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ‌ల్ఫ్‌, కొరియాలో మార్కెట్ పెంచుకున్నాడు

By:  Tupaki Desk   |   21 July 2024 4:30 PM GMT
పాక్ బ్యూటీ స‌రే! దాయాది దేశంలో స్టార్ అయ్యేదెలా?
X

ప్రపంచవ్యాప్తంగా ప్ర‌భాస్ కి ఫాలోయింగ్ ఉంది. ఇండియా, చైనా, జ‌పాన్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ‌ల్ఫ్‌, కొరియాలో మార్కెట్ పెంచుకున్నాడు. కానీ అత‌డు ఇంకా పాకిస్తాన్ మార్కెట్లోకి అడుగు పెట్ట‌లేదు? పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ ఇక‌పై దాయాది దేశంలోకి అడుగుపెడనే అభిమానులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో మార్కెట్ ప‌రిమితమైన‌ది గ‌నుక‌ దీనిని సీరియ‌స్ గా తీసుకునే అవ‌కాశం క‌నిపించ‌లేదు.

కానీ తాజా క‌బ‌ర్ మేర‌కు ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ దాయాది దేశం పాకిస్తాన్‌కి చెందిన పాపుల‌ర్ క‌థానాయిక‌ న‌టించ‌నుంద‌ని తెలిసింది. ప్రభాస్ -హను రాఘవపూడి కాంబినేష‌న్ సినిమాలో పాకిస్థాన్ నటి సజల్ అలీ నటిస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. దివంగత నటి శ్రీదేవి నటించిన `మామ్` చిత్రంలో సజల్ అలీ తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. స‌జ‌ల్ అలీ ఎంపికైందా లేదా? అనేది ఇంకా టీమ్ అధికారికంగా నిర్ధారించ‌లేదు. కానీ ఈ పుకార్ ప్ర‌భాస్ అభిమానుల్లో సంచ‌ల‌నంగా మారింది.

బాలీవుడ్ అంద‌గ‌త్తెలు దీపిక ప‌దుకొనే, శ్ర‌ద్ధా కపూర్, ఈవ్ లిన్ శ‌ర్మ‌, జాక్విలిన్ ఫెర్నాండెజ్ ల‌తో క‌లిసి ప్ర‌భాస్ ప‌ని చేసాడు. కానీ పాకిస్తానీ భామ‌ల‌తో క‌లిసి న‌టించ‌లేదు ఇంత‌కాలం. ఇప్పుడు అలాంటి అరుదైన అవ‌కాశం అత‌డిని వెతుక్కుంటూ వ‌స్తోందనేది దాని సారాంశం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగా పెట్టుబడి పెట్ట‌నుంది. సీతా రామం తరువాత స్వరకర్త విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం హను రాఘవపూడితో తిరిగి కలుస్తారు. ఇటీవ‌ల‌ మారుతితో రాజా సాబ్ విడుద‌లపై ప్ర‌భాస్ ఫోక‌స్ ఉంది. త‌దుప‌రి హ‌నుతో సినిమాను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ 2 వ‌చ్చే ఏడాది ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని కూడా స‌మాచారం. నాగ్ అశ్విన్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ కల్కి 2898 ఏడి సీక్వెల్ కూడా ఉంటుంది. కానీ దానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. హ‌నుతో పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడిగా న‌టించనున్నాడు. ఈ మూవీ గురించి మరింత స‌మాచారం రావాల్సి ఉంది.