Begin typing your search above and press return to search.

మైన‌స్ 30 డిగ్రీల చ‌లిలో బికినీ బ్యూటీ సాహ‌సం

సాక్షి సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించిన ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2025 5:30 AM GMT
మైన‌స్ 30 డిగ్రీల చ‌లిలో బికినీ బ్యూటీ సాహ‌సం
X

మ్యూజిక్ వీడియోలు, మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో పాపులారిటీ పెంచుకుంది ముంబై బ్యూటీ సాక్షి మాలిక్. ఫిట్‌నెస్ వీడియోల‌తోను ఇన్‌స్టాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ బ్యూటీ కార్తీక్ ఆర్యన్ న‌టించిన‌ `సోను కే టిటు కి స్వీటీ`లో `బోమ్ డిగ్గీ డిగ్గీ...` పాటలో మెరుపులు మెరిపించింది. సాక్షి స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ ఇప్ప‌టికీ యూట్యూబ్ లో కుర్ర‌కారుకు స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో సందేహం లేదు.


సాక్షి సోష‌ల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించిన ఈ బ్యూటీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది. తాజాగా సాక్షి పింక్ బికినీలో స్పెష‌ల్ ఫోటోషూట్‌ని షేర్ చేసింది. ఈ ఫోటోలలో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో సాక్షి ఇచ్చిన ట్రీట్ యువ‌త‌రం హృద‌యాల‌ను దోచుకుంది. పింక్ బికినీలో సాక్షి అందాల జాతార ఫిదా చేస్తోంది. మైన‌స్ 30 డిగ్రీల చ‌లిలో బికినీ షూట్ లో పాల్గొన్న‌ట్టు సాక్షి తెలిపింది. గ‌త వారం 30 డిగ్రీల వేడి వాతావ‌ర‌ణంలో ఉన్నాను. ఇప్పుడు చ‌లికి గ‌డ్డ‌క‌ట్టే వాతావ‌ర‌ణంలో ఫోటోషూట్ లో పాల్గొన్న‌ట్టు వెల్ల‌డించింది.


ఈ ముంబై బ్యూటీ టాప్ మోడ‌ల్ గా టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ తో ఆడియెన్ కి చేరువైంది. మారుతి ఆటో ఎక్స్ పో-2020 వేదిక‌పై బ్రాండ్ అంబాసిడ‌ర్ గా హృద‌యాల‌ను దోచుకుంది. ఆ త‌ర్వాత సాక్షి సినీరంగంపై దృష్టి సారించింది.


సాక్షి మాలిక్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేసింది. కళాశాల సమయంలో ఆమె ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది.


గ్రాడ్యుయేషన్ తర్వాత, సాక్షి మాలిక్ ముంబైకి వెళ్ళింది. నైకా, పిసి జ్యువెలర్‌తో సహా బ్రాండ్‌ల టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం మోడలింగ్ చేసింది.. 2018లో సోను కే టిటు కి స్వీటీ లో నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

2020 తెలుగు సినిమా `వి`(నాని-ఇంద్ర‌గంటి-సుధీర్ బాబు)లో కమర్షియల్ సెక్స్ వర్కర్ గా త‌న ఫోటోని ఉపయోగించుకున్నారు. దీనికి అభ్యంత‌రం చెబుతూ సాక్షి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. మార్చి 2021లో హైకోర్టు అమెజాన్ ప్రైమ్‌ను ఆ సినిమాను తొల‌గించాల్సిందిగా ఆదేశించింది. అనుమ‌తి లేకుండా ఫోటోను ఉప‌యోగించినందున సాక్షి కేసు ఫైల్ చేసింది. అటుపై వి సినిమాని ఓటీటీ నుండి తొల‌గించారు. అయితే వివాదాన్ని మేక‌ర్స్ మాట్లాడి ప‌రిష్క‌రించుకున్నారు. 2020లో వేహం.. 2023లో `ములాఖత్` అనే ఆల్బ‌మ్స్‌లో క‌నిపించింది.