Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: న‌ట‌న‌తో కాదు భంగిమ‌ల‌తో బుక్ చేస్తోంది

సాక్షి మాలిక్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టి కం మోడ‌ల్. బికినీ బీచ్ ట్రీట్‌తో నిరంత‌రం కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించ‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌.

By:  Tupaki Desk   |   29 March 2025 4:00 AM
Sakshi Malik Strom SocialMedia In Pictures
X

సాక్షి మాలిక్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టి కం మోడ‌ల్. బికినీ బీచ్ ట్రీట్‌తో నిరంత‌రం కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించ‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. మ్యూజిక్ వీడియోలు, మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో పాపులారిటీ పెంచుకున్న సాక్షి కార్తీక్ ఆర్యన్ న‌టించిన‌ `సోను కే టిటు కి స్వీటీ`లో `బోమ్ డిగ్గీ డిగ్గీ...` పాటలో మెరుపులు మెరిపించింది. ఈ సినిమా త‌ర్వాత అమ్మ‌డికి బాలీవుడ్ లో భారీ అవ‌కాశాలొస్తాయ‌ని భావించినా అంత‌గా ఛాన్సులైతే లేవు.


మ‌రోవైపు సాక్షి సోష‌ల్ మీడియాల్లో జోరు ప్ర‌ద‌ర్శిస్తోంది. ల‌క్ష‌లాదిగా ఉన్న ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ కి నిరంత‌ర ట్రీట్ ఇవ్వ‌డంలో ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌దు. తాజాగా బంతాట‌తో గుబులు పుట్టిస్తోంది. కొత్త అబ్సెషన్ #పాడిల్‌బాల్ అంటూ బ్యాట్ బాల్ ఈమోజీల‌ను షేర్ చేసింది. ఈ ఆట బంతితో కాదు కుర్రాళ్ల గుండెల‌తో! అంటూ అబ్బాయిలు మ‌రిగిపోతున్నారు. స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఇలాంటి కొత్త ఆట మొద‌లు పెట్టిందేమిటీ? అంటూ కొంద‌రు ఆక‌తాయిగా ప్ర‌శ్నిస్తున్నారు. సాక్షి బంతి పై విరుచుకుప‌డుతూనే ర‌కరకాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా అవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. సాక్షి మాలిక్ వేడిగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్. కొంద‌రు భంగిమ‌ల‌తో కాదు న‌ట‌న‌తో నిరూపించు అంటూ స‌జెస్ట్ చేస్తున్నారు.


ఈ ముంబై బ్యూటీ టాప్ మోడ‌ల్ గా టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ తోను ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితం. సాక్షి మాలిక్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేసింది. కళాశాల సమయంలో ఆమె ఫ్యాషన్ షోలలో హీటెక్కించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత, సాక్షి మాలిక్ ముంబైకి వెళ్ళింది. నైకా, పిసి జ్యువెలర్‌తో సహా బ్రాండ్‌ల టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం మోడలింగ్ చేసింది.. 2018లో సోను కే టిటు కి స్వీటీ లో నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2020లో వేహం.. 2023లో `ములాఖత్` అనే ఆల్బ‌మ్స్‌లో క‌నిపించింది. సాక్షి త‌దుప‌రి పెద్ద అవ‌కాశం కోసం వేచి చూస్తోంది. కానీ ఆ ఒక్క ఛాన్స్ త‌న‌కు ఇంకా రాలేదు.