Begin typing your search above and press return to search.

ఆయ‌న‌తో సినిమా అంటే 106 డిగ్రీలు జ్వ‌రమే!

దివంగ‌త సీనియ‌ర్ న‌టుడు సాక్షి రంగారావు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 8:30 AM GMT
ఆయ‌న‌తో సినిమా అంటే 106 డిగ్రీలు జ్వ‌రమే!
X

దివంగ‌త సీనియ‌ర్ న‌టుడు సాక్షి రంగారావు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 550 సినిమాలు చేసిన చ‌రిత్ర ఆయ‌న సొంతం. ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల్లో న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. దాదాపు నాలుగు ద‌శాబ్ధాల సినీ ప్ర‌స్తానం ఆయ‌న‌ది. సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు రాసుకునే వెళ్లారు. తొలి సినిమా `సాక్షి`నే ఆయ‌న ఇంటిపేరుగా మారిపోయింది.

ఆ త‌ర్వాత ఆయ‌న వార‌స‌త్వం నుంచి ఎవ‌రూ న‌టుడిగా ముందుకు రాలేదు. వివిధ రంగాల్లో స్థిర‌ప‌డ్డారు. తాజాగా ఆయ‌న త‌న‌యుడు సాక్షి శివ తండ్రి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే... `మా నాన్నగారు చేసిన మొదటి సినిమా `సాక్షి`. అదే ఆ తరువాత ఇంటిపేరుగా మారిపోయింది. 550 సినిమాలకి పైగా ఆయన నటించారు.

అప్పట్లో ఇండస్ట్రీలో నటన వైపు నుంచి హేమా హేమీలు ఉండేవారు. కొత్త వాళ్లకి అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉండేది. డబ్బులు డిమాండ్ చేస్తే వచ్చిన వేషం పోతుందని, ఎంత ఇస్తే అంతే ఆయన తీసుకునేవారు. ఎన్ని పాత్రలు చేసినా, కొత్త పాత్ర వస్తే టెన్షన్ పడిపోయేవారు. ఇక విశ్వనాథ్ గారి సినిమా నుంచి ఛాన్స్ వస్తే, నాన్నకి 106 జ్వరం వచ్చేసేది. ఆయనలో పిరికితనం .. భయం ఎక్కువగా ఉండేవి. నాన్నగారికి అప్పు చేయడం అన్నా కూడా భయమే. ఎప్పుడైనా అవసరమైతే చంద్రమోహన్ గారిని అడిగేవారు.

వచ్చిన దాంట్లోనే స్థలాలు కొనమని శోభన్ బాబుగారు చెప్పారుగానీ, నాన్నగారు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన పోయే సమయానికి, చెల్లని చెక్కులు మా ఇంట్లో ఒక కట్ట కట్టి ఉండేవి. ఆయన అన్ని వందల సినిమాలు చేసినప్పటికీ, చివరికి మిగిలింది ఒక ఇల్లు . నాలుగైదు లక్షల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే` అన్నారు.