Begin typing your search above and press return to search.

శర్వా కోసం ఏజెంట్ పాప.. ఎంత అందంగా ఉందొ..

శర్వానంద్ కెరీర్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్‌లో కొనసాగుతోంది. వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:48 AM GMT
శర్వా కోసం ఏజెంట్ పాప.. ఎంత అందంగా ఉందొ..
X

శర్వానంద్ కెరీర్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్‌లో కొనసాగుతోంది. వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన మనమే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శర్వా, ఇప్పుడు తన 37వ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సెన్సేషనల్ హిట్ సమజవరగమన చిత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఏజెంట్ హీరోయిన్ శర్వానంద్ కు జోడిగా కనిపించబోతోంది. నిత్యా పాత్రలో ఆమె నటించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సాక్షి వైద్య మొదట్లో సోషల్ మీడియా ద్వారా మంచి ఫేమ్ అందుకుంది.

అనంతరం ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అమ్మడు ఇప్పుడు తన అందంతో మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. ఇక శర్వానంద్37వ సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో కనిపించనుందట. ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. సాక్షి వైద్య ఈ సినిమాలో ఆర్కిటెక్ట్‌గా కనిపించబోతున్నారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు, గ్నాన శేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహిస్తున్నారు. భాను బొగవరపు కథ రాయగా, నందు సావిరిగానా డైలాగ్‌లు రాశారు. బ్రహ్మ కదలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర సహ-నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎక్స్-ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

సాక్షి వైద్య గతంలో కొన్ని చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు అందుకుంది. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. శర్వానంద్తో జోడిగా ఆమె నటన, కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అనుకుంటున్నారు. ఇకపోతే, శర్వానంద్ ఈ చిత్రంలో తన మునుపటి పాత్రలతో పోలిస్తే కొత్త తరహా పాత్రలో కనిపించనున్నాడు. కుటుంబ సంబంధాలు, ప్రేమ కథతో మిళితమైన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా రూపొందిస్తున్నారు. మరి సాక్షి వైద్య కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తుందో, శర్వానంద్‌తో ఆమె జోడీ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.