Begin typing your search above and press return to search.

టాప్ 3 లో 'సలార్'.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌

2024 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో సలార్‌ టాప్‌ 3లో చోటు సంపాదించింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 9:16 AM GMT
టాప్ 3 లో సలార్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించిన సలార్‌ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్రపంచంలోనూ మంచి స్పందన దక్కించుకుంది. తాజాగా సినిమా హిందీ వర్షన్‌ ను ఉత్తరాదిన టీవీల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాను టెలికాస్ట్ చేసిన సంస్థ సలార్ సినిమాకి అత్యధిక వ్యూస్ లభించినట్లుగా ప్రకటించింది. వారి ప్రకటన వారం మూడు కోట్ల మంది సలార్ సినిమాను టీవీల్లో చూశారు. 2024 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో సలార్‌ టాప్‌ 3లో చోటు సంపాదించింది.

అత్యధిక వ్యూస్ లభించాయంటూ సోషల్‌ మీడియా ద్వారా సదరు టీవీ ఛానల్ ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ సినిమా ఉత్తరాదిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలను పక్కకు నెట్టేసింది. అంటే సలార్‌ ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కు కచ్చితంగా కిక్ ఇచ్చే విధంగా ఈ ప్రకటన ఉందని కొందరు అంటూ ఉంటే, ఇదే రేంజ్‌లో జోరు కొనసాగితే బాలీవుడ్‌ లోనూ ప్రభాస్ టాప్‌ స్టార్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆయన అభిమానులు కామెంట్స్ పంచుకుంటూ ఉన్నారు.

సలార్ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్‌ చేసే పనిలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నాడు. మరోవైపు ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను చేస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న రాజాసాబ్‌ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అక్టోబర్‌ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మారుతి పుట్టిన రోజు కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే టీజర్ ను రెడీ చేసే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్‌, మారుతి కాంబో మూవీ తర్వాత ఫౌజీ సినిమాలో నటించబోతున్నాడు.

ఫౌజీ సినిమాకు సీతారామం సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న దర్శకుడు హను రాగపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్నాడు ఆ సినిమా షూటింగ్ ప్రభాస్ లేకుండా ఇప్పటికే ప్రారంభమైంది, త్వరలోనే ప్రభాస్ సైతం జాయిన్ కాబోతున్నాడని సమాచారం అందుతుంది. ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రభాస్ వచ్చే లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఆ తర్వాత అది మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మొత్తానికి ప్రభాస్ అభిమానులకు కిక్‌ ఇచ్చే విధంగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.