సలార్ ఫైట్ సీన్‌ను రీ క్రియేట్ చేసిన తమిళనాడు స్టూడెంట్స్
సోషల్ మీడియా క్రేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో తెలియడం లేదు.
By: Tupaki Desk | 14 Feb 2025 12:29 PM GMTసోషల్ మీడియా క్రేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో ఏది ఎప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో తెలియడం లేదు. ఆడియన్స్ కు ఏ కంటెంట్ ఎప్పుడు నచ్చుతుందో అంచనా వేయలేక పోతున్నాం. సోషల్ మీడియాలో ప్రతీదీ ట్రెండ్ చేయడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సలార్ సినిమాలోని ఓ సీన్ నెట్టింట వైరలవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సలార్. హోంబళే ప్రొడక్షన్స్ బ్యానర్ లో విజయ్ కిరగందుర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజైన టైమ్ లో ఎంతటి సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.
మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ప్రభాస్ కనిపించేది తక్కువ. డైలాగ్స్ ఇంకా తక్కువ. సినిమా మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తోనే నింపేశాడు డైరెక్టర్ ప్రశాంత్. సలార్ సినిమాలోని కోల్ మైన్ ఫైట్ ఎంత ఫేమస్ అనేది తెలుసు. సినిమా రిలీజై సంవత్సరంన్నర తర్వాత అనుకోకుండా ఆ సీన్ వార్తల్లో నిలుస్తోంది.
దానికి కారణం లేకపోలేదు. తమిళనాడులోని ఓ యూనివర్సిటీలో స్టూడెంట్స్ సలార్ సినిమాలోని కోల్ మైన్ ఫైట్ ను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా కాలేజ్, యూనివర్సిటీలు, ఏదైనా ఈవెంట్స్ లో సినిమాల్లోని సాంగ్స్ కు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తుంటారు. కానీ తమిళనాడు స్టూడెంట్స్ సలార్ సినిమాలోని ఫైట్ ను రీక్రియేట్ చేశారు. ఆ స్టూడెంట్స్ చేసిన ప్రయోగం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.
సలార్ సినిమాకు సీక్వెల్ గా సలార్2 రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తర్వాత వీలు చూసుకుని సలార్2 చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను పూర్తి చేసుకుని ప్రభాస్ కోసం ఫ్రీ అయిపోతాడు.