సలార్ : 300 రోజులు కంటిన్యూస్‌గా..!
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచ దేశాల్లో ప్రభంజనం సృష్టించింది.
By: Tupaki Desk | 18 Dec 2024 10:34 AM GMTప్రభాస్ గత ఏడాది డిసెంబర్‌లో 'సలార్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ 1 సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసి, ఆ తర్వాత ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచ దేశాల్లో ప్రభంజనం సృష్టించింది. అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, అత్యధిక వ్యూ అవర్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా సలార్ నిలిచిన విషయం తెల్సిందే.
సలార్ నెట్ ఫ్లిక్స్‌తో పాటు కొన్ని రోజుల తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో గత 300 రోజులుగా సలార్ సినిమాను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. దాంతో సినిమా అప్పటి నుంచి కంటిన్యూస్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఒక సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రెండు లేదా మూడు వారాలు మహా అయితే అయిదు వారాలు ట్రెండ్ కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా ఏకంగా 300 రోజులుగా కంటిన్యూస్‌గా ట్రెండ్ కావడం మామూలు విషయం కాదు. ఇది కేవలం ప్రభాస్ కే సాధ్యం, ప్రశాంత్ నీల్ వంటి గొప్ప ఫిల్మ్ మేకర్‌కే సాధ్యం అనడంలో సందేహం లేదు.
కేజీఎఫ్ వంటి భారీ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సలార్ సినిమా రూపొందింది. మొదటి పార్ట్ సలార్ కి అనూహ్య స్పందన వచ్చింది. శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్‌ను చూసి మతి పోతుంది అంటూ కామెంట్స్ చేసిన వారు ఎంతో మంది ఉంటారు. కాటేరమ్మ యాక్షన్ సన్నివేశం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
రికార్డ్ స్థాయి వసూళ్లను సొంతం చేసుకున్న సినిమాలను ఓటీటీలో ప్రేక్షకులు అంతగా చూడరు. ఎందుకంటే సినిమాను థియేటర్‌లోనే చూసి ఉంటారు కనుక మళ్లీ ఓటీటీలో ఏం చూస్తారని అనుకుంటాం. కానీ సలార్ విషయంలో అలా జరగడం లేదు. చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నారు. సలార్ కి షాకింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. స్ట్రీమింగ్ అయ్యి 300 రోజులు అవుతున్నా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది అంటే సలార్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. సలార్ 2 కి పరిస్థితులు ఎలా ఉంటాయో కనీసం ఊహకు సైతం అందడం లేదు. థియేటర్‌లలో రికార్డ్‌లు బద్దలు అయితే, ఓటీటీలో సరికొత్త రికార్డ్‌లు నమోదు అవుతాయేమో చూడాలి.