సలార్ 2.. లేపడంలో ఎవరు తగ్గట్లే..
కేవలం బాబీ సింహ మాత్రమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ పార్ట్ మామూలుగా ఉండదు అని గట్టిగానే లేపుతున్నారు.
By: Tupaki Desk | 7 March 2024 2:30 AM GMTహై వోల్టేజ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నిల్ ప్రభాస్ తో సలార్ సీక్వెల్ ను కూడా వీలైనంత తొందరగా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది అనే కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి.
అంతేకాకుండా కొన్ని ఏరియాలలో కూడా సినిమా పెట్టిన పెట్టుబడికి పూర్తిగా వెనక్కి తీసుకురాలేకపోయింది అని కూడా టాక్ వినిపించింది. ఏదేమైనా కూడా ప్రభాస్ మాత్రం మొత్తానికి కొన్ని డిజాస్టర్ సినిమాల తర్వాత సలార్ తో పర్వాలేదు అనిపించాడు అనే సంతృప్తి అయితే ఫ్యాన్స్ కు కలిగింది. అందులో కొన్ని ప్రభాస్ ఎలివేషన్స్ సీన్లు బాగా క్లిక్ అయ్యాయి. ఓటీటీ లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక సలార్ 2 శౌర్యంగాపర్వం ఎప్పుడు వస్తుందా అని ఓవర్గం ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా నటుడు బాబీ సింహ ఒక ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అని చెప్పాడు. ఆయన సినిమాలో భైరవ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ లోనే సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోవచ్చు అని కూడా అన్నాడు. అంతేకాకుండా ఈసారి ఫస్ట్ పార్ట్ కంటే కూడా రెండవ భాగంలో పవర్ ఫుల్ సన్నివేశాలు ఉంటాయి అని కూడా ఆయన వివరణ ఇచ్చారు. కేవలం బాబీ సింహ మాత్రమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ పార్ట్ మామూలుగా ఉండదు అని గట్టిగానే లేపుతున్నారు.
రీసెంట్ గా నిర్మాత కామెంట్స్ కూడా అదే తరహాలో ఉన్నాయి. విజయ్ కిరగందూర్ సలార్ 2 పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేశారు. సలార్ సెకండ్ పార్ట్ శౌర్యంగా పర్వం స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ఫినిష్ అయ్యాయి. ఇక ఫస్ట్ పార్ట్ చాలా సంతృప్తిని ఇచ్చిందని ఇప్పుడు సెకండ్ పార్ట్ అంతకుమించి అనేలా ఉంటుందని అన్నారు. అలాగే సలార్ 2 చూస్తే గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహాలో ఉంటుందని చెప్పడం మరీంత హాట్ టాపిక్ గా మారింది. అందులోని క్యారెక్టర్లు ఎలివేషన్స్ హై వోల్టేజ్ డ్రామా మంచి త్రిల్లింగ్ గా ఉంటుందని అన్నారు. మరి సినిమా ఆ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందో లేదో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.