Begin typing your search above and press return to search.

అక్కడ తుఫాను మొదలైంది

మరోవైపు, యూకేలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే £75K దాటేశాయట.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:34 AM GMT
అక్కడ తుఫాను మొదలైంది
X

సౌత్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ కోసం కేవలం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రపంచ సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అవ్వాల్సిన ఈ సినిమా.. అనేక కారణాల వల్ల డిసెంబర్ 22కు వాయిదా పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బుకింగ్స్​ వివరాలు బయటకు వస్తున్నాయి. అనేక దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం అందుతోంది.

అమెరికాలో సలార్‌ టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్ నవంబరు నెలలో​ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టికెట్లు విడుదలైన కొద్ది క్షణాల్లోనే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ $500K దాటేశాయట. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, యూకేలో కూడా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే £75K దాటేశాయట. ఆస్ట్రేలియాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ 70Kమార్కు క్రాస్ అయిందట. యూఏఈలో అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారమే ప్రారంభం కాగా.. అక్కడ కూడా సలార్ మేనియా నడుస్తోంది.

ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన నాన్ రాజమౌళి మూవీగా సలార్ రికార్డు సృష్టించనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత భారీ అంచనాలు పెంచుకున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. కొందరు ట్రైలర్ కు మిక్స్ డ్ రివ్యూలు ఇచ్చినా.. యాక్షన్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకులు ఉంటారని అంటున్నారు.

కేజీఎఫ్ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించింది. ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. ఈశ్వరి రావు, టీనూ ఆనంద్, సప్తగిరి, శ్రీయ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.