Begin typing your search above and press return to search.

డైనోసార్ తో రిస్క్ అవసరమా డెవిల్?

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న డెవిల్ టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:57 AM GMT
డైనోసార్ తో రిస్క్ అవసరమా డెవిల్?
X

నందమూరి హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. గత ఏడాది బింబిసారా సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ ఏడాది డెవిల్ తో మరో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పీరియాడికల్ జోనర్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రాబోతోంది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న డెవిల్ టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది. అభిషేక్ నామా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో కళ్యాణ్ రామ్ నుంచి డెవిల్ మూవీ రాబోతోంది. ఈ సినిమాని డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి వారం రోజులు ముందు డిసెంబర్ 22న రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సలార్ మూవీ రిలీజ్ అయ్యి వారం రోజుల్లోనే డెవిల్ రిలీజ్ చేయాలని అనుకోవడం అంటే పెద్ద రిస్క్ అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ సలార్ కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఆ బజ్ రెండు వారాలపాటు ఉంటుంది. ఆ టైంలో ఏ సినిమా వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉండదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాంటిది కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాని వారం రోజుల గ్యాప్ లోనే రిలీజ్ చేస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ మార్కెట్ పరిధికి మించి డెవిల్ సినిమా పైన నిర్మాత అభిషేక్ నామా ఖర్చు పెట్టారు. ఇదంతా పూర్తిస్థాయిలో రికవరీ చేయాలంటే వెనుక ముందు సాలిడ్ సినిమాలు లేకుండా కరెక్ట్ టైం చూసుకుని రిలీజ్ చేస్తే బెటర్ అనే మాట సినీ విశ్లేషకులు నుంచి వినిపిస్తోంది. దీనిపై దర్శక నిర్మాత ఎలాంటి ఆలోచన చేస్తారనేది ఇప్పుడు చూడాలి