Begin typing your search above and press return to search.

సలార్.. ఏపీలో గట్టి దెబ్బె?

ఏపీలో ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు ఆశించిన స్థాయిలో జరగలేదు. కేవలం 40 రూపాయిలు మాత్రమే అదనంగా సినిమాకి పెంచారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:38 AM GMT
సలార్.. ఏపీలో గట్టి దెబ్బె?
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సలార్. ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్ లో పడిపోయాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ట్విట్టర్ లో ప్రస్తుతం సలార్ పబ్లిక్ టాక్ ట్రెండ్ అవుతోంది. కచ్చితంగా ఈ ఏడాదిలో టాలీవుడ్ కి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని సలార్ ఇస్తుందని బలంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని అన్ని ఏరియాలలో సాలిడ్ బిజినెస్ ని నిర్మాత విజయ్ కిరంగదూర్ చేశారు. అయితే రెగ్యులర్ గా లీడింగ్ లో ఉండే డిస్టిబ్యూటర్స్ కి కాకుండా తన సన్నిహితులకి హక్కులు ఇచ్చిన నిర్మాత రిలీజ్ చేయిస్తున్నారు. ఇలా కొత్త డిస్టిబ్యూటర్స్ రంగంలోకి దించారు. గుంటూరు, కృష్ణా వంటి ప్రాంతాల్లో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు కాని కేఎస్ఎన్ టెలీఫిల్మ్ లకి హక్కులని ఇచ్చారు.

వీరు సరిగా డీల్ చేయలేకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ తగ్గాయి. ఏపీలో ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు ఆశించిన స్థాయిలో జరగలేదు. కేవలం 40 రూపాయిలు మాత్రమే అదనంగా సినిమాకి పెంచారు. గతంలో అధిపురుష్ కి 50 రూపాయిలు పెంచారు. అక్కడ దెబ్బపడింది. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు.

ఈ కారణంగా ఓపనింగ్స్ పై ఈ బిజినెస్ నిర్ణయాలన్నీ ప్రభావం చూపిస్తున్నాయి. పెద్ద డిస్టిబ్యూటర్స్ కి సినిమాని అమ్మేసి ఉంటే వారు పెర్ఫెక్ట్ గా ప్రమోట్ చేసుకొని భారీ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేలా చేసేవారు. కాని లా జరగలేదు. ఈ కారణంగా ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ లో ఓపెనింగ్ డే కలెక్షన్స్ సలార్ కి రావనే మాట వినిపిస్తోంది.

అదే జరిగితే కచ్చితంగా నిర్మాత తీసుకున్న అతిపెద్ద రాంగ్ నిర్ణయంగా ఇది మిగిలిపోతుంది. హిట్ టాక్ పడితే మాత్రం థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యి కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.