Begin typing your search above and press return to search.

RRR.. సలార్.. అదే మ్యాజిక్

ఇక బాలీవుడ్, తెలుగు రాష్ట్రాలలో అయితే కచ్చితంగా హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకునేలా కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:04 AM GMT
RRR.. సలార్.. అదే మ్యాజిక్
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం సలార్. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సలార్ సిరీస్ లో మొదటి భాగం డిసెంబర్ 22న థియేటర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ మార్కెట్ లెక్కలని మరోసారి షో అప్ చేయబోతున్న మూవీగా సలార్ ఉంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్ తో సినిమాకి కొంత బజ్ తీసుకొని వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ మరల బయటకొచ్చి సినిమా కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాను చూసిన డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ బెస్ట్ అని కంప్లిమెంట్ కూడా కూడా ప్రభాస్ ఇచ్చేశాడు. మూవీ కూడా కేజీఎఫ్ సిరీస్ ని మించి ఉంటుందని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది.

అయితే కొద్ది రోజులు సినిమాపై ఎలాంటి రిలీజ్ బజ్ లేకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఇప్పుడైతే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్ లైన్ లో ఓపెన్ అయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ సందడి షురూ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా బుక్ మై షో ద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ తో జోరు కనిపిస్తోంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తక్కువ షోలు ఓపెన్ చేసిన ఇప్పటికే 25000 టికెట్స్ బుక అయిపోయాయంట.

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో రాబోతున్న పెర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీగా సలార్ ప్రాజెక్ట్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వస్తోన్న రెస్పాన్స్ సినిమా లెవల్ ఏంటో చెబుతోంది. ఈ సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్ కి బిగ్గెస్ట్ హిట్ రావడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఎన్నడూ లేనంత స్పీడ్ కనిపిస్తుంది.

ఇక బాలీవుడ్, తెలుగు రాష్ట్రాలలో అయితే కచ్చితంగా హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఈ రెండు, మూడు రోజుల్లో సలార్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయనేది అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ బట్టి తెలిసిపోతుంది.