సలార్.. బాక్సాఫీస్ ఎలా ఉండబోతోంది?
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది
By: Tupaki Desk | 21 Dec 2023 1:30 AM GMTటాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన సలార్ సెకండ్ ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఈ క్రమంలోనే సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ చూసేందుకు అందరూ సలార్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.
ఓవర్సీస్ తో పాటు నార్త్ లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఓపెన్ అయ్యాయి. ప్రెజెంట్ సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలోనే సలార్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ రూ.50 కోట్ల మార్క్ దాటడంతో రిలీజ్ రోజు వరకు కచ్చితంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ నైజాంలో ముందుగా ఆఫ్లైన్ టికెట్స్ ఓపెన్ చేశారు. అంటే సెలెక్టెడ్ థియేటర్స్ లో కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈ విషయం తెలియగానే ఆడియన్స్ థియేటర్స్ వద్ద బారులు తీరారు. ఇక ఆ తర్వాత కొన్ని గంటలకు ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేశారు. బుక్ మై షో లో అలా ఓపెన్ పెట్టగానే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అందరూ ఒక్కసారిగా పోటీపడ్డారు.
లక్షలాది మంది ఒకేసారి ప్రయత్నించడంతో ఆఖరికి బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయిపోయింది. దీన్నిబట్టి సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఇండియా వైడ్ గా సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.24కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్ లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 3 మిలియన్ మార్క్ అందుకుంది. అంటే ఓవరాల్ గా ఈ మూవీ డే వన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.50 కోట్లు దాటిపోయింది.
అంతేకాకుండా ఫస్ట్ వీకెండ్ లోనే వరల్డ్ వైడ్ గా రూ.65 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ని అందుకోగా మొదటిరోజు షోలు ప్రారంభమయ్యే ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సలార్ కంటే ముందు తలపతి విజయ్ నటించిన 'లియో' మూవీ ఈ అరుదైన ఘనతను సాధించింది. ఇప్పుడు సలార్ కూడా ఆ రేర్ ఫీట్ ని అందుకోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు.
సలార్ డే1 టార్గెట్ కూడా లియో ఓపెనింగ్స్ ని క్రాస్ చేయడమే. ఈ ఏడాదిలో రూ.145 కోట్ల గ్రాస్ తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'లియో' నిలిచింది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తూ సలార్ రూ.150 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే సినిమా పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 'కేజిఎఫ్ 2' ఓపెనింగ్స్ ని సైతం బ్రేక్ చేసే ఛాన్సులు 'సలార్' కి పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు.