Begin typing your search above and press return to search.

సలార్' కి అసలు పరీక్ష మొదలు!

ఇక నాలుగో రోజు కూడా వీకెండ్ క్రిస్మస్ హాలిడే కావడంతో సలార్ సాలిడ్ బుకింగ్స్ ను నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 6:20 AM GMT
సలార్ కి అసలు పరీక్ష మొదలు!
X

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజే రూ.178 కోట్ల గ్రాస్ అందుకొని ఈ ఇయర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీగా నిలిచింది.రెండో రోజు రూ. 250 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడో రోజు కలుపుకొని ఓవర్‌ ఆల్‌గా ఈ రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది.

ఇక నాలుగో రోజు కూడా వీకెండ్ క్రిస్మస్ హాలిడే కావడంతో సలార్ సాలిడ్ బుకింగ్స్ ను నమోదు చేసింది. సలార్ నాలుగో రోజు మరో రూ.100 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ రోజు నుంచే సలార్ కి అసలైన టెస్ట్ మొదలైంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్, సోమవారం క్రిస్మస్ హాలిడే కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ రికార్డ్ స్థాయిలో వసూలు అందుకుంది.

అయితే నార్మల్ వర్కింగ్ డేస్ లో సలార్ కలెక్షన్స్ ఇలాగే ఉంటాయా లేక తగ్గుతాయా అనేది ఈరోజు నుంచి తేలబోతోంది. కాబట్టి ఈరోజు సలార్ కి చాలా కీలకం. మునుపటి లాగే ఈరోజు నుంచి కూడా సలార్ అదే ఊపుని కొనసాగించినట్లయితే ఈ వీకెండ్ ముగిసే వరకు బాక్సాఫీస్ వద్ద సలార్ ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈరోజు సలార్ కలేక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకునేందుకు ట్రేడ్ విశ్లేషకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాకి సెన్సార్ 'A' సర్టిఫికెట్ ఇవ్వడంతో మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చిన్న పిల్లలతో వస్తే ఏమాత్రం లోపలికి పంపించడం లేదు. అంతేకాదు టికెట్ తీసుకునే సమయంలో కూడా వయసు నిబంధనలు కచ్చితంగా చూస్తున్నారు. 18ఏళ్ల లోపు వారికి టికెట్లు ఇవ్వడం లేదు.

తల్లిదండ్రులు థియేటర్స్ నిర్వహకులతో గొడవ పడుతున్నా లోపలికి పంపించడం లేదు. ఈ నిబంధనల కారణంగా సలార్ కలెక్షన్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. అయితే ఈ నిబంధనలను కేవలం మల్టీప్లెక్స్ యాజమాన్యం మాత్రమే అమలు చేసింది. గతంలో చాలా సినిమాలకి ఈ నిబంధనని పెద్దగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఏదో చూసి చూడనట్లు వదిలేశారు. కానీ సలార్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.