సలార్ రిస్కీ బిజినెస్.. తేడా వస్తే కష్టమే?
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో అవసరం అయితే డీల్స్ సెట్టవ్వని ఏరియాలలో సొంతంగా విడుదల చేసుకోవాలని అనుకున్నారు.
By: Tupaki Desk | 16 Nov 2023 1:30 PM GMTప్రభాస్ నటించిన సలార్ సినిమాపై అంచనాలు ఉంచడంలో గట్టిగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాపై కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయినప్పటికీ కూడా మార్కెట్లో డిమాండ్ మాత్రం అసలు తగ్గలేదు. సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఇక ప్రొడక్షన్ హౌస్ హాంబెల్ చాలా నమ్మకంగా ఈ సినిమాపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది. డీల్స్ విషయంలో ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం కంగారు పడలేదు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో అవసరం అయితే డీల్స్ సెట్టవ్వని ఏరియాలలో సొంతంగా విడుదల చేసుకోవాలని అనుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో నిర్మాతలు సొంతంగానే విడుదల చేసుకుంటున్నారు. అయితే అన్నిచోట్ల దాదాపు బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనా కాస్త రిస్క్ అనేలా బిజినెస్ వ్యవహారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక విధంగా హై రేంజ్ లో నిర్మతలు థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ లాభాలు అందుకున్నారు. కానీ సినిమాపై పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు మాత్రం కాస్త రిస్క్ తీసుకుంటున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కేవలం ఆంధ్ర రీజినల్ లోనే ఈ సినిమా దాదాపు 80 నుంచి 85 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. అంటే సినిమా మినిమం 150 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటేనే ప్రాఫిట్ లోకి వస్తుంది.
ఇక మరోవైపు నైజం లో కూడా దాదాపు 70 కోట్ల రేంజ్ లోనే ధర పలికినట్లు సమాచారం. సినిమా అక్కడ కూడా 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఉత్తరాంధ్రలో సెట్ అయిన డీల్ ప్రకారం అయితే 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంటేనే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి వస్తారు.
ఇక టాక్ ఏ మాత్రం తేడాగా ఉన్నా కూడా అలాగే యావరేజ్ టాక్ వచ్చిన కూడా లాభాలు అందించడం కష్టమే. ఎందుకంటే గతంలో సక్సెస్ టాక్ వచ్చిన సినిమాలు కూడా పూర్తిస్థాయిలో ఆంధ్రాలో అయితే ప్రాఫిట్ అందించలేకపోయాయి. కేవలం ఇటీవల కాలంలో హై బడ్జెట్ తో వచ్చిన సినిమాలలో RRR మాత్రం పెట్టిన పెట్టుబడులకు పర్ఫెక్ట్ లాభాలను అందించింది. ఇక ఇప్పుడు సలార్ సినిమా మంచి టాక్ అందుకోవాలి. అలాగే నాలుగు వారాలు థియేటర్లలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ లోపే లాభాలను కూడా అందుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి సమయంలో చాలా సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే మ్