Begin typing your search above and press return to search.

ఏపీ నైజాం బాక్సాఫీస్.. ప్రభాస్ హై డామినేషన్

తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం సలార్ సందడే కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:20 AM GMT
ఏపీ నైజాం బాక్సాఫీస్.. ప్రభాస్ హై డామినేషన్
X

తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రస్తుతం సలార్ సందడే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. షారుక్ డంకీ సినిమాకు గట్టి షాక్ ఇస్తూ దూసుకెళ్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.175 కోట్లకుపైగా (గ్రాస్) కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో ఫస్ట్ డే సుమారు రూ.95 కోట్లు సాధించిందని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓపెనింగ్ రోజే రూ.70 కోట్లను వసూలు చేసిందట సలార్. నిన్న(శుక్రవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ దాదాపు 88.93 శాతం నిండిపోయాయి.

అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు అత్యధిక షేర్ రాబట్టిన మూవీల్లో సలార్ చిత్రం రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది. మూడో స్థానంలో బాహుబలి-2, నాలుగో ప్లేస్లో సైరా నరసింహా రెడ్డి, ఐదో స్థానంలో సాహో ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఐదింటిలో మూడు ప్రభాస్ సినిమాలే ఉండడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా సలార్ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కర్ణాటకలో రూ.12 కోట్లు, కేరళలో రూ.5 కోట్లు కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టింది. దీంతో పాటు కలెక్షన్స్ విషయంలో సలార్ అనేక రికార్డులు బ్రేక్ చేసినందుకు ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

సలార్ బ్రేక్ చేసిన రికార్డుల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ ఇండియాలో రూ.57 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. ఆ తర్వాత ఆయన హీరోగా తెరకెక్కిన జవాన్ ఏకంగా రూ.75 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను సాధించింది. రణబీర్ కపూర్ నటించిన యానిమల్ రూ.63 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాలను బీట్ చేసి సలార్ ఏకంగా రూ.95 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌ను సాధించింది.