Begin typing your search above and press return to search.

'సలార్' నాన్ RRR బ్లాస్ట్.. నైజాం కింగ్!

అప్పడెప్పుడో బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు సలార్ తో మరో హిట్ సాధించారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 9:27 AM GMT
సలార్ నాన్ RRR బ్లాస్ట్.. నైజాం కింగ్!
X

అప్పడెప్పుడో బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు సలార్ తో మరో హిట్ సాధించారు. ఇప్పుడు సలార్ దెబ్బకు బాక్సాఫీస్ అల్లాడిపోతోంది. వసూళ్ల మోత మోగిస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముందే అనుకున్నట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.175 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో సలార్ మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది. నైజాంలో సలార్ మూవీ నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డును క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో మొదటి రోజు 22.55 కోట్ల షేర్‌ ను రాబట్టింది సలార్. మొత్తంగా నైజాం మార్కెట్‌లో ఈ మువీ దుమ్ముదులిపేసింది.

నైజాంలో 23.35 కోట్ల షేర్‌ తో టాప్ ప్లేస్‌ లో ఉంది ఆర్ ఆర్ ఆర్. ఇప్పుడు సలార్ సెకండ్ ప్లేస్‌ లో నిలిచింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ అండ్ మార్కెట్ ను దృష్టిలో చూస్తే ప్రభాస్ సోలోగానే వచ్చి అద్భుతం చేసి చూపించారనే చెప్పాలి. సలార్‌ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెండ్ లో మరిన్ని రికార్డులు సెట్ చేయడం పక్కా.

అయితే నైజాంలో సలార్ భారీ మొత్తంలో బిజినెస్ చేయడంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కీలక పాత్ర పోషించింది. నైజాం మొత్తంలో రికార్డు స్థాయిలో థియేటర్లలోని సినిమాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఎక్స్ ట్రా షోలు కూడా ప్రదర్శించింది.

మరోవైపు, నార్త్ అమెరికాలో సలార్ సినిమా దుమ్మురేపుతోంది. కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతోంది. ప్రీమియర్స్, డే 1 కలిపి 3.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నాలుగు మిలియన్ల డాలర్ల మార్కుకు చేరువలో ఉంది. నార్త్ అమెరికాలో సలార్ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. ఎక్కవ షోస్ సలార్ సినిమాకు దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.