సలార్ వెయ్యి కోట్లు అందుకోవాలంటే అదొక్కటే మార్గం
డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సలార్
By: Tupaki Desk | 25 Dec 2023 4:25 AM GMTడార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా సలార్. ఈ సినిమా మొదటి రోజు నుంచి కలెక్షన్స్ పరంగా పరుగులు పెడుతోంది. ఈ ఏడాదిలో హైయెస్ట్ గ్రాస్ ని సలార్ మూవీ అందుకుంది. రెండో రోజు కూడా 117 కోట్లు కలెక్షన్స్ అందుకుంది. ఆదివారం కూడా కలెక్షన్స్ వంద కోట్లు దాటిపోయాయని తెలుస్తోంది.
క్రిస్మస్ ఫెస్టివల్ ఉండటంతో సోమవారం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. వీకెండ్ లో ఎంత ప్రభావం చూపిస్తోంది. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ పరంగా అంతే స్థాయిలో ప్రభావం చూపించి ఆడియన్స్ ని సలార్ మూవీ థియేటర్స్ కి రప్పించాల్సి ఉంటుంది. ఈ ఇంపాక్ట్ సలార్ మూవీ కలెక్షన్స్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లడంలో కీలకం అవుతుంది.
ఇక సౌత్ నుంచి ఇప్పటి వరకు వెయ్యి కోట్లకిపైగా కలెక్షన్స్ అందుకన్న సినిమాలు అంటే బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్2, ఆర్ఆర్ఆర్. ఈ మూడు సినిమాలు కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉన్నాయి. వెయ్యి కోట్లు కలెక్షన్స్ ని ఈ చిత్రాలు అందుకోవడానికి బాలీవుడ్ మార్కెట్ కూడా కారణం అని చెప్పాలి. సౌత్ లో ఈ సినిమాలు ఎంత సత్తా చాటాయో అంతే స్థాయిలో నార్త్ లో కూడా ప్రభావం చూపించాయి.
బాహుబలి 2 మూవీ అయితే హిందీ బెల్ట్ లో 500 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. తరువాత కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా 435 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ కూడా 275 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ ఆయా సినిమాలు వెయ్యి కోట్లకి పైగా మార్క్ ని దాటడానికి సహకరించాయి. ఈ ఏడాదిలో వచ్చిన జవాన్, పఠాన్ సినిమాలు వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించడానికి హిందీ బెల్ట్ కారణం.
అలాగే జైలర్, లియో మూవీస్ వెయ్యి కోట్లని టచ్ చేయలేకపోవడానికి కారణం కూడా హిందీ మార్కెట్. అక్కడ ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో సౌత్ సినిమా వెయ్యి కోట్లు దాటి వసూళ్లు చేయాలంటే మాత్రం కచ్చితంగా హిందీ మార్కెట్ లో మంచి సక్సెస్ అందుకొని కలెక్షన్స్ పరంగా బలమైన ప్రభావం చూపించాలి. లేదంటే సలార్ వెయ్యి కోట్లుఅందుకోవడం కష్టమైపోతుంది. ప్రస్తుతం సలార్ మీద నార్త్ లో విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దానిని తట్టుకొని సలార్ నిలబడుతుందా అనేది చూడాలి.