Begin typing your search above and press return to search.

సలార్ హిందీ కలెక్షన్స్ తగ్గడానికి ఆ తప్పే కారణమా?

దీనికి కారణం సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేయడానికి ప్రభాస్ కటౌట్ చాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ కావడమే

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:30 AM GMT
సలార్ హిందీ కలెక్షన్స్ తగ్గడానికి ఆ తప్పే కారణమా?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే 600 కోట్ల కలెక్షన్స్ కి సమీపించింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేవీ లేకపోవడం వలన సలార్ కి కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో పోల్చుకుంటే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువ అనే మాట వినిపిస్తోంది.

దీనికి కారణం సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేయడానికి ప్రభాస్ కటౌట్ చాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ కావడమే. తెలుగులో అయితే ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ బేస్, పాజిటివ్ ఇమేజ్ కారణంగా పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదు. అయితే ఇతర భాషలలో అలా కాదు. కచ్చితంగా ప్రమోషన్స్ అవసరం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సలార్ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. ఆయన మార్కెట్ ని నమ్ముకొని ప్రశాంత్ నీల్ రిలీజ్ చేసేశారు.

ప్రభాస్ ఇమేజ్ తో కలెక్షన్స్ హిందీ బెల్ట్ లో వంద కోట్లు అయితే దాటిపోయాయి. కాని మూవీకి ఉన్న పాజిటివ్ టాక్ తో 200 కోట్ల వరకు కలెక్షన్స్ చేసే అవకాశం ఉండేదని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అంటున్నారు. నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ లేకపోవడమే సలార్ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని, సలార్ ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా డిఫరెంట్ స్ట్రాటజీతో ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా ఇప్పుడొచ్చిన వాటికంటే మంచి కలెక్షన్స్ వచ్చేవని అభిప్రాయపడ్డారు.

గతంలో ప్రభాస్ సాహో సినిమాని నార్త్ ఇండియాలో విపరీతంగా ప్రమోట్ చేశారు. ఈ కారణంగానే ఎవరేజ్ టాక్ తో కూడా సాహో మూవీ వంద కోట్లకి పైగా కలెక్షన్స్ ని హిందీలో సాధించింది. ఆదిపురుష్ మూవీకి కూడా ప్రమోషన్స్ భారీగానే చేశారు. అందుకే హిందీ బెల్ట్ లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2కి నార్త్ లో ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేశారు.

కాని సలార్ మూవీకి ఎక్కడా ప్రమోషన్స్ చేయలేదు. ఈ కారణంగానే నార్త్ మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని ట్రెండ్ పండితులు సైతం చెబుతున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఈ తప్పు ఎందుకు చేసాడనేది మాత్రం అర్ధం కాని విధంగా ఉంది.