Begin typing your search above and press return to search.

సలార్.. కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే..

డార్లింగ్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ లాంటి సినిమాగా సలార్ ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:05 AM GMT
సలార్.. కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే..
X

డార్లింగ్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ లాంటి సినిమాగా సలార్ ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే 600 కోట్ల వరకు సలార్ కలెక్షన్స్ రీచ్ అయ్యాయి. ఓవరాల్ గా 800 కోట్ల వరకు లాంగ్ రన్ లో ఈ మూవీ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఇప్పటికి థియేటర్స్ కి ఆడియన్స్ వస్తూ ఉండటమే.

నార్త్ ఇండియాలో సలార్ కి పోటీగా డంకీ మూవీ వచ్చింది. దీంతో చాలా థియేటర్స్ బ్లాక్ చేసి డంకీకి ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు వారం రోజుల్లోనే కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్ అయ్యాయి. దీంతో డంకీ ఆడే థియేటర్స్ లో సలార్ ని రిప్లేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కలెక్షన్స్ మెల్లగా పుంజుకున్నాయి.

దీంతో ఇప్పటికే నార్త్ ఇండియాలో 100 కోట్ల గ్రాస్ ని సలార్ దాటేసింది. లాంగ్ రన్ లో మరో 50 కోట్లు అయిన కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని సలార్ దాటేసింది. ఏపీలో కూడా దగ్గరకి వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అదిరిపోయే కథ కూడా సలార్ తో ఉండటం వలన ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు

ఈ వీకెండ్ కూడా న్యూ ఇయర్ కూడా సలార్ కి కలిసివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ డెవిల్, రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. దీంతో మళ్ళీ వీకెండ్ సలార్ సినిమా వైపే ఆడియన్స్ మొగ్గు చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో కాకపోయిన ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే విధంగా సలార్ మూవీ ఉండటం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సలార్ 2 మూవీ కూడా డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దానిని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది.