Begin typing your search above and press return to search.

సలార్ కలెక్షన్స్.. ఇంకా ప్రాఫిట్స్ రాలేదా?

ప్రభాస్ సలార్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలోనే కలెక్షన్స్ అందుకుంది

By:  Tupaki Desk   |   2 Jan 2024 11:49 AM GMT
సలార్ కలెక్షన్స్.. ఇంకా ప్రాఫిట్స్ రాలేదా?
X

ప్రభాస్ సలార్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలోనే కలెక్షన్స్ అందుకుంది. అసలు సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ కూడా స్టార్ ఇమేజ్ డైరెక్టర్ కాంబినేషన్ వలన ఓపెనింగ్స్ పై పెద్దగా ప్రభావం అయితే పడలేదు. కానీ హిందీలో మాత్రం ఆ ప్రభావం కొంచెం పడింది అని సినిమా ప్రముఖులు మాత్రం చెబుతున్నారు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ఓ వర్గం ఫ్యాన్స్ కు అయితే బాగానే నచ్చేసింది. ముఖ్యంగా ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. అయితే సెకండ్ హాఫ్ కథనం విషయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమాకు మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేయనే మాట కూడా వినిపిస్తోంది.

ఇక మొదటి వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ రేంజ్ లో అయితే ఆ తర్వాత అయితే రావడం లేదు. అసలు సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ను రీచ్ అయిందా లేదా అనే వివరాల్లోకి వెళితే.. సలార్ సినిమా జనవరి ఒకటి వరకు బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 145 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కర్ణాటక నుంచి ఈ సినిమాకు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా తమిళనాడులో మాత్రం ఆశించినంత స్థాయిలో అయితే నెంబర్స్ రావడం లేదు.

ఇక కేరళలో కూడా సినిమాకు తక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. కానీ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి సినిమా సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే 60 కోట్లు దాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సలార్ సినిమా 312 కోట్లకు షేర్ కలెక్షన్స్ 578 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఓవరాల్ గా చేసిన బిజినెస్ 345 కోట్లు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 347 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. అంటే సినిమా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ తో చూస్తే మరో 34 కోట్లు రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వెబక్కి తీసుకురావాల్సి ఉంది. ఏదైనా సరే ఈ వారంలో మంచి కలెక్షన్స్ సాధిస్తేనే టార్గెట్ ఫినిష్ అవుతుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి.

ఏపీ తెలంగాణ:- 145.09CR

కర్ణాటక: 21.45Cr

తమిళనాడు: 10.90Cr

కేరళ: 6.55Cr

హిందీ ROI: 66.40Cr

ఓవర్సస్ - 61.85Cr*****

వరల్డ్ వైడ్ టోటల్: 312.24CR(Gross- 578.40CR~)