'సలార్' కి వీరి పాత్ర అత్యంత కీలకం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు నిరాశ పరిచాయి.
By: Tupaki Desk | 2 Nov 2023 6:36 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. సాహో, రాధేశ్యామ్ మరియు ఆదిపురుష్ లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో విఫలం అయ్యాయి. అందుకే సలార్ సినిమా విషయంలో ఎలాంటి అజాగ్రత్తకి చోటు ఇవ్వడం లేదు.
సలార్ సినిమా తెలుగు వర్షన్ కంటే కూడా హిందీ వర్షన్ ఎక్కువ వసూళ్లు సాధించాలనే పట్టుదలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నాడు. కేజీఎఫ్ మాదిరిగా సలార్ సినిమా కి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. సలార్ లోని ప్రభాస్ పాత్ర డబ్బింగ్ నుంచి మొదలుకుని ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది.
బాహుబలి సినిమా హిందీ వర్షన్ లో ప్రభాస్ పాత్రకు గాను హిందీ నటుడు శరద్ కేల్కర్ తో డబ్బింగ్ చెప్పించడం జరిగింది. ఆ సినిమాలో ప్రభాస్ పాత్రకి ప్రాణం పోసినట్లుగా ఆయన డబ్బింగ్ చెప్పాడు. అందుకే సలార్ సినిమాకు కూడా ఆయన్నే రిపీట్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఇక సలార్ సినిమా కన్నడ వర్షన్ పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మొదట ప్రభాస్ తో డబ్బింగ్ చెప్పించాలనుకున్నా చివరికి ప్రతిభావంతుడైన వశిష్ఠ సింహ తో సలార్ కన్నడ పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తున్నారట. ప్రశాంత్ నీల్ కి వశిష్ఠ కి మంచి సాన్నిహిత్యం ఉంది.. అంతే కాకుండా ఇద్దరికి సక్సెస్ సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే సలార్ కన్నడ వర్షన్ కోసం వశిష్ఠ రంగంలోకి దిగుతున్నాడట.
మొత్తానికి ఇతర భాషల్లో ప్రభాస్ పాత్రలకు డబ్బింగ్ చెప్పిన వీరు అత్యంత కీలకం. అందుకే ప్రముఖులను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే. ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటించడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు క్రేజ్ ఉంది. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అన్నట్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.