సలార్ - డుంకి.. ఇద్దరికి ఎసరు పెట్టాడు!
అయితే ఇంత హైప్ ఉన్న సినిమాలకు ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. కానీ అక్కడ ఇప్పుడు ఆక్వామెన్ 2 వచ్చి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 28 Oct 2023 6:21 AM GMTప్రభాస్ సలార్ సినిమాతో పాటు షారుఖ్ డుంకి కూడా డిసెంబర్ 22 టార్గెట్ చేయడంతో ఈ పోటీ మధ్యలో ఎవరు వచ్చినా కూడా ఏమాత్రం నిలవలేరు అని చెప్పవచ్చు. ఆ సమయంలో రావడానికి ఎవరూ కూడా అంటగా ఆసక్తిని చూపించడం లేదు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ రెండు సినిమాలపై తప్ప మరే సినిమాలపై కూడా పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు.
అందుకే ఇతర సినిమా నిర్మాతలు కూడా రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదు. అయితే ఈ రెండు సినిమాలకు మొన్నటి వరకు అయితే స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పక్కా అని ఆ విషయంలో ఎలాంటి తిరుగులేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ నుంచి పెద్ద సినిమానే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. సలార్ డుంకి రెండు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా రాబోతున్నాయి.
ఒక వైపు షారుఖ్ ఖాన్ మరోవైపు ప్రభాస్.. వీరిద్దరి స్టార్ హోదా తోనే బిజీగా 100 కోట్లు ఓపెనింగ్స్ అయితే వస్తాయి. దానికి తోడు దర్శకులు ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరాని బ్రాండ్ ఇమేజ్ కావాల్సినంత బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇంత హైప్ ఉన్న సినిమాలకు ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. కానీ అక్కడ ఇప్పుడు ఆక్వామెన్ 2 వచ్చి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నారు.
ఆక్వామెన్: ది ఫాలెన్ కింగ్ డం రేస్.. అసలు డిసెంబర్ 20న రావాల్సింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా 22కు సినిమాను వాయిదా వేశారు. అంటే అదే రోజు సలార్ డుంకి రాబోతున్నాయి. ఇక డిసెంబర్ 21న ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి హడావిడి మాములుగా ఉండదు. అక్వమాన్ ఫస్ట్ పార్ట్ అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసింది.
సముద్రపు వీరుడి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆడియన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఇక ఐమాక్స్ లాంటి పెద్ద స్క్రీన్ మొత్తం కూడా ఈ సినిమాని డామినేట్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో సలార్ డుంకి సినిమా ఓవర్సీస్ బయ్యర్లకు అయితే చెమటలు పడుతున్నాయి. ఆక్వామాన అదే రోజు పోటీకి రావడంతో ప్రీమియర్స్ పై ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది.
అయితే ఎలాంటి టాక్ వచ్చినా కూడా డిసెంబర్ హాలిడేస్ లో అలాంటి హాలీవుడ్ సినిమాకు స్ట్రాంగ్ కలెక్షన్స్ అయితే ఇస్తాయి. ఇక ఇండియాలో కూడా ఆక్వామాన్ కొన్ని మినిమమ్ థియేటర్స్ అందుకునే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ గట్టిగా వస్తే ఇండియాలో కూడా హాలీవుడ్ సినిమాలు కూడా తిరుగుండదు. కాబట్టి ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. చూడాలి మరి డుంకి, సలార్ ఎలా నిలబడతాయో.