Begin typing your search above and press return to search.

షారుక్ డంకీ.. సలార్​ ఫ్యాన్స్ హ్యాపీ

బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్ లేటెస్ట్​ మూవీ డంకీ.. తాజా టీజర్​తో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్​ కానున్నట్లు క్లారిటీ అయిపోయింది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 6:39 AM GMT
షారుక్ డంకీ.. సలార్​ ఫ్యాన్స్ హ్యాపీ
X

బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్ లేటెస్ట్​ మూవీ డంకీ.. తాజా టీజర్​తో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్​ కానున్నట్లు క్లారిటీ అయిపోయింది. దీంతో బాక్సాఫీస్​ వద్ద సలార్​ వర్సెస్​ డంకీ ఫిక్స్ అయిపోయింది. అయితే రెండు రూ.1000కోట్ల బ్లాక్ బస్టర్ల హిట్లతో జోష్ మీదున్న షారుక్​.. తమ చిత్రానికి పోటీకి వస్తున్నారని సలార్ ఫ్యాన్స్​ మొన్నటి వరకు కాస్త టెన్షన్ పడ్డారు కానీ ఇప్పుడు మాత్రం ఖుషీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే పఠాన్, జవాన్ లాంటి రెండు మాస్-యాక్షన్ ఎంటర్​టైనర్​తో హిట్​ కొట్టి షారుక్ రూట్ మార్చి.. డంకీలో క్లాస్​గా మారిపోయాడు. టీజర్​లో రాజ్ కుమార్ హిరాని మార్క్​ స్పష్టంగా కనిపించింది. ఫన్, లవ్​ అండ్ ఎమోషనల్​ డ్రామాగా సాగిన టీజర్​లో యాక్షన్​ ఎక్కడా కనపడలేదు. ఈ సాఫ్ట్ స్టోరీ సినిమా హిట్​ అవుతుందని అనిపించనప్పటికీ.. సలార్​తో పోల్చితే పోటీ కాదనే అనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు రాజ్ కుమార్ హిరాని మార్క్​ క్లాస్ ఎంటర్టైనర్లకు అంతగా డిమాండ్ ఉండట్లేదు. ఇప్పుడంతా సినీ ప్రియులు మాస్, యాక్షన్ సినిమాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్​. హీరో ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్స్​లు, విజువల్స్​ ఉంటేనే భారీగా థియేటర్లకు వెళ్తున్నారు.

అందుకు ఉదాహరణే షారుఖ్​ ఖాన్ నటించిన చివరి రెండు సినిమాలు పఠాన్, జవాన్. ఈ చిత్రాల్లో పెద్దగా కథ లేకపోయినా.. యాక్షన్ ఘట్టాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడలాంటి అంశాలు సలార్​లో పక్కా ఉన్నాయి. కాబట్టి సౌత్​తో పాటు నార్త్​లో డంకీపై సలార్ ఆధిపత్యం చెలాయిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు.

డంకీకి ఎంత మంచి టాక్ తెచుకున్నా.. మెట్రో సిటీల్లో, మల్టీప్లెక్సుల వరకు పరిమితమవ్వచ్చు. కానీ మిగతా చోట్ల సలార్​ దూకుడు తట్టుకోవడం కష్టమే. కానీ సలార్ మాత్రం మెట్రో సిటీలు, మల్టీప్లెక్సుల్లోనూ గట్టి ప్రభావం చూపొచ్చు. ఫైనల్​గా డంకీలో హీరోయిజం ఎలివేషన్​, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్​ లేకపోవడం.. సలార్​కు భారీగా కలిసొస్తుంది. అదే సమయంలో షారుక్​.. డంకీతో హిట్ అందుకున్నా పఠాన్, జవాన్ రేంజ్​లో రికార్డ్ వసూళ్లను అందుకుంటాడా అనేది డౌటే.