Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ రూపం నీళ్ల‌లో ఊహించుకుని!

ఒక గిన్నెలో నీళ్లు వేసి, అందులో టీపొడి వేస్తూ చాలా సులువుగా ప్ర‌భాస్ ఫోటోగ్రాఫ్ ని తీర్చిదిద్దింది స‌ద‌రు యువ‌తి. నిజంగా ఇది స‌ర్ ప్రైజ్ అనే అనాలి.

By:  Tupaki Desk   |   7 March 2024 5:06 PM GMT
ప్ర‌భాస్ రూపం నీళ్ల‌లో ఊహించుకుని!
X

హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినీరంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ. KGF చాప్టర్ 2, కాంతార: ఎ లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్ లో 'స‌లార్ పార్ట్ 1: సీజ్ ఫైర్' బ్లాక్‌బస్టర్ నోట్ తో 2023 సంవత్సరాన్ని ముగించింది. యాక్షన్ సీక్వెన్సులు, క్రాఫ్ట్ .. భారీ విజువ‌ల్స్ తో ఫ్రాంఛైజీపై ఆస‌క్తిని పెంచారు. ఈ చిత్రం మాస్‌లో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది.

ప్రభాస్ పోషించిన దేవా అకా సలార్ పాత్ర‌ మాస్‌లో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ప్ర‌భాస్ మ్యానరిజమ్స్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు నటన, యాక్షన్ సన్నివేశాల వరకు ప్రభాస్ పాత్రలో ప్రతిదానిని ప్ర‌జ‌లు ప్రశంసించారు. విడుదలైన మూడు నెలల తర్వాత కూడా స‌లార్ ఫీవ‌ర్ ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సును శాసిస్తోంది.

ఇటీవలే ప్రభాస్ మహిళా అభిమాని స‌లార్- దేవా పాత్ర స్ఫూర్తితో అందమైన నీటి కళను రూపొందించారు. ఒక గిన్నెలో నీళ్లు వేసి, అందులో టీపొడి వేస్తూ చాలా సులువుగా ప్ర‌భాస్ ఫోటోగ్రాఫ్ ని తీర్చిదిద్దింది స‌ద‌రు యువ‌తి. నిజంగా ఇది స‌ర్ ప్రైజ్ అనే అనాలి. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ప్ర‌భాస్ పై ఆమె అభిమానం ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తోంది.

స‌లార్ డిజిటల్ గా విడుదలయ్యాక కూడా ప్రేక్షకుల నుండి ప్రేమను అందుకుంది. ఇది డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నంబర్ 1 స్థానాన్ని పొందింది. ఇప్పుడు ప్రేమను స్వీకరించే దేవా పాత్ర మోస్ట్ అవైటెడ్ పార్ట్ 2లో భారీ యాక్ష‌న్ కి సిద్ధం కానుంది. 'సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం' సీక్వెల్‌కు దారితీసే శక్తివంతమైన క్లైమాక్స్‌తో మొద‌టి భాగం ప్రేక్షకులను సీటు అంచున ఉంచింది. ఇటీవల హోంబలే ఫిలింస్ - ప్రశాంత్ నీల్ సీక్వెల్‌ను ఏప్రిల్ 2024లో సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని యోచిస్తున్నారని కూడా క‌థ‌నాలొచ్చాయి. సీక్వెల్ స‌లార్ 2 క‌థాంశంపై ప్ర‌జ‌ల్లో భారీ ఆస‌క్తి నెల‌కొంది. మంచి స్నేహితులు అయినప్పటికీ, ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్ శ‌త్రువులుగా మార‌తార‌ని, వారి మ‌ధ్య ఢీకొట్టే స‌న్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.