సలార్.. ఆ ఏరియాలో కూడా హై డిమాండ్
అయితే రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసేందుకు ఒక ప్రముఖ కంపెనీ దాదాపు 12 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
By: Tupaki Desk | 7 Oct 2023 9:37 AM GMTఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకున్న సలార్ సినిమా వాయిదా పడడం ఫ్యాన్స్ కు చాలా నిరాశను కలిగించింది. బాహుబలి తరువాత వరుసగా రెండు సినిమాలతో డిజాస్టర్ ఎదుర్కొన్న ప్రభాస్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని కూడా ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమాను ఊహించని విధంగా డిసెంబర్ కు షిఫ్ట్ చేశారు.
ఇక ఈ సినిమా బిజినెస్ విషయంలో కొన్ని తేడాలు వచ్చినట్లుగా గత కొన్ని రోజులుగా అనేక రకాల న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. అడ్వాన్స్ ఇచ్చినవారు కూడా డీల్ క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు అని సోషల్ మీడియాలో గాసిప్స్ పుట్టుకొచ్చాయి.
ఇక అలాంటి రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా చిత్ర యూనిట్ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఇక మరికొన్ని ఏరియాలకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అయితే ఇంకా క్లోజ్ కాలేదు అని సమాచారం. అయితే రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన రైట్స్ కొనుగోలు చేసేందుకు ఒక ప్రముఖ కంపెనీ దాదాపు 12 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
అయితే అటువైపు నుంచి మొత్తంగా నిర్మాతలు 15 కోట్ల మేరకు కోట్ చేశారు. కానీ ఆ లెక్క చివరికి 13.60 కోట్లకు ఫిక్స్ చేసుకున్నారు. అంతకంటే తక్కువ స్థాయిలో సినిమా హక్కులను అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు. కానీ ఒక ప్రముఖ కంపెనీ మాత్రం 12 కోట్ల దక్కితే సినిమా రైట్స్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందట. ఇంకా ఈ విషయంలో మరికొన్ని రోజులు చర్చలు జరిగే అవకాశం ఉంది.
హోంబెల్ ఫిలిమ్స్ ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వీలైనంతవరకు ముందుగానే వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని వాళ్ళు అయితే ధీమాగా ఉన్నారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ మరికొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాను మళ్ళీ కొత్తగా నవంబర్ చివరి నాటికి సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. మరి ఇంత గ్యాప్ తీసుకున్న సలార్ ఆడియోన్స్ నిరీక్షణకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.