సలార్.. మైత్రి వాళ్ళకు పెద్ద రిస్కే..
తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుంది అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు.
By: Tupaki Desk | 17 Nov 2023 4:25 PM GMTప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుంది అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. అసలే ప్రభాస్ సక్సెస్ లేక చాలా కాలంగా సతమతమవుతున్నాడు.
బాహుబలి తర్వాత చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ప్రభాస్‌కు సలార్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ రావాలి అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సలార్ సినిమా పై అంచనాలు అయితే కొంచెం కూడా తగ్గడం లేదు. ఈ సినిమా సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వలన డిసెంబర్ 22 కు షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈసారి విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్న విధానంతోనే అర్థమవుతుంది అయితే నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా గట్టిగానే పోటీపడ్డారు. దిల్ రాజు కూడా ఈ సినిమా నైజాం హక్కుల కోసం గట్టిగానే పోటీపడినప్పటికీ మైత్రి వారు భారీ రేటుకు కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలోనే మైత్రి వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
ఇక మొదటిసారి ఈ సంస్థ అత్యధిక స్థాయిలో ఖర్చు చేసి సలార్ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసింది. ఈ ఒక్క ఏరియా రైట్స్ కోసం దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నైజాంలో 90 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రేంజ్ లో నైజాం ఏరియాలో ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక టాక్ కేవలం నార్మల్ గా వస్తే సరిపోదు. ఒక వారం పాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కలెక్షన్స్ సాలిడ్ గా ఉండాలి. అప్పుడే పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం దక్కుతుంది.