KGF కంటే సలార్ స్కేల్ ఐదు రెట్లు పెద్దది
ఒక ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ యాక్షన్ డ్రామా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. కేజీఎఫ్ కంటే సలార్ స్కేల్ ఐదు రెట్లు పెద్దదని చెప్పారు.
By: Tupaki Desk | 14 Dec 2023 12:47 PM GMTమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ 'సలార్' విడుదలకు కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 22 రిలీజ్ కి సర్వసన్నాహకాల్లో ఉన్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిలింస్ పతాకంపై ఈ భారీ చిత్రం తెరకెక్కింది. నిన్న మేకర్స్ మొదటి సింగిల్‌ని విడుదల చేయగా అద్భుత రెస్పాన్స్ వచ్చింది.
ఒక ఇంటర్వ్యూలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ యాక్షన్ డ్రామా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. కేజీఎఫ్ కంటే సలార్ స్కేల్ ఐదు రెట్లు పెద్దదని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోనే తాము మరో రామోజీ ఫిల్మ్ సిటీని సృష్టించామని భువన్ గౌడ పేర్కొన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమా కోసం కెజిఎఫ్ సెట్స్‌ని వాడుతున్నారనే పుకార్లను సినిమాటోగ్రాఫర్ తోసిపుచ్చారు. భువన్ గౌడ మాట్లాడుతూ.. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ 100 ఎకరాల్లో భారీ సెట్స్ వేశారు. సాంకేతికంగా మేము వేరే స్థాయిలో ఉన్నాము. భారతీయ సినిమాలో వేసిన అతిపెద్ద సెట్లలో ఇదొకటి... అని తెలిపారు.
సలార్ వర్సెస్ డంకీ:
సలార్ రిలీజ్ కి సరిగ్గా ఒక రోజు ముందు షారూఖ్ ఖాన్ నటించిన డంకీ థియేటర్లలోకి విడుదలవుతోంది. దీంతో సలార్ వర్సెస్ డంకీ వార్ షురూ అయింది. ముఖ్యంగా థియేటర్ల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొందని హిందీ మీడియాల్లో కథనాలొస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 40 శాతం డంకీకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనేది తాజా అప్ డేట్. దీని వల్ల సలార్ కు ఎంత డిమాండ్ ఉన్నా సరే అన్ని భాషలకు కలిపి 38 శాతం స్క్రీన్లు ఇస్తారని టాక్. ఇదే జరిగితే సలార్ నేషనల్ వైడ్ ఓపెనింగ్స్ కి గండి పడినట్టేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మాస్ యాక్షన్ సినిమా సలార్ డామినేషన్ కొనసాగాలంటే థియేటర్లు ఎక్కువగా ఉండాలి. కానీ థియేటర్ల వార్ లో ఖాన్ టీమ్ ఒకడుగు ముందు ఉందని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.
ఆక్వామేన్ 2తో షేరింగ్:
నిజానికి సలార్ - డంకీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సలార్ భారీ బజ్‌ని సృష్టిస్తోంది. ప్రభాస్ సినిమాపై భారీ హైప్ ఉంది. సలార్ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రభాస్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అయితే ఒక భారీ హాలీవుడ్ చిత్రం, షారూఖ్ డంకీ రెండూ సలార్ కి పోటీగా బరిలో దిగుతుండడం స్క్రీన్ల విషయంలో పోటీకి తెర లేచింది. హాలీవుడ్ చిత్రం ఆక్వామాన్ ఇదే సీజన్ లో విడుదలవుతుండడంతో ఇది కొన్ని స్క్రీన్లను షేర్ చేస్కుంటోంది. దీంతో థియేటర్ల పరంగా పోటీ తీవ్రమైందని ట్రేడ్ చెబుతోంది.