Begin typing your search above and press return to search.

వాళ్ళనే ఎక్కువ టెన్షన్ పెడుతోన్న సలార్

దానికి తోడు సినిమాకి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ చిత్ర యూనిట్ చేయడం లేదు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:54 AM GMT
వాళ్ళనే ఎక్కువ టెన్షన్ పెడుతోన్న సలార్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి సిద్ధం అవుతోన్న మూవీ సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. డార్లింగ్ అభిమానులు అయితే సలార్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. కేజీఎఫ్ ట్రైలర్స్ రేంజ్ లో ఎఫెక్ట్ చూపించలేదు. దానికి తోడు సినిమాకి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ చిత్ర యూనిట్ చేయడం లేదు. కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం లేదు. దీంతో సలార్ సౌండ్ అయితేపెద్దగా వినిపించడం లేదు. కేవలం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది.

అయితే డిస్టిబ్యూటర్స్ లో మాత్రం రోజు రోజుకి టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఈ సినిమా రైట్స్ ని నిర్మాతలు అత్యధిక ధరలకి అమ్మారు. ఒక్క నైజాంలోనే ఏకంగా 65 కోట్లకి రైట్స్ అమ్మారు. ఇప్పటి వరకు ఏ సినిమా నైజాంలో 50 కోట్లకి మించివెళ్ళలేదు. కానీ సలార్ మీద నమ్మకంతో భారీ మొత్తం పెట్టుబడి పెట్టారు. మిగిలిన ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిర్మాత అయితే బాగానే బిజినెస్ చేసుకున్నారు.

కానీ డిస్టిబ్యూటర్స్ నుంచి బయ్యర్లు మాత్రం భారీ ధరలకు సినిమాని కొనడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి నష్టపోవడం కంటే ముందుగానే జాగ్రత్త పడటం ఉత్తమం అనే ఆలోచనతో బయ్యర్లు ఉన్నారంట. ఒకవేళ ఎక్కువ ధరలకి కొనడానికి సిద్ధమైన సగం డబ్బులు మాత్రమే డిస్టిబ్యూటర్స్ కి ఇస్తామని అంటున్నారంట.

రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వస్తే మిగిలిన ఎమౌంట్ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకౌవడాని ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. బయ్యర్ల ఎఫెక్ట్ తో ఇప్పుడు భారీ ధరలకు హక్కులుకొన్న డిస్టిబ్యూటర్స్ టెన్షన్ పడుతున్నారని టాక్. మూవీ ప్రమోషన్స్ లేకపోవడంతో ఆడియన్స్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న టాక్.