`సలార్` ఇంత అడ్వాన్స్ గానా?
పాన్ ఇండియాని షేక్ చేసే సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని ట్రేడ్ సైతం అంచనా వేస్తుంది.
By: Tupaki Desk | 19 Nov 2023 2:03 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ `సలార్` భారీ అంచనాల మధ్య డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనా లు ఆకాశన్నంటున్నాయి. సలార్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. వరుస ప్లాప్ లతో ఉన్నా డార్లింగ్ ని సలార్ తప్పకుండా బటయకు తెస్తుందని...పాన్ ఇండియాని షేక్ చేసే సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని ట్రేడ్ సైతం అంచనా వేస్తుంది.
ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్ కి వైఫల్యా లున్నా..కేజీఎఫ్ బ్రాండ్ సహా ప్రశాంత్ నీల్ కంటెంట్ కావడంతో! ఆ నెగిటివిటీ పెద్దగా ఫోకస్ అవ్వడం లేదు. బిజినెస్ పరంగా ఎంత వీలైంతా చేసేస్తోంది. దొరికిన ఏ చాన్స్ ని హోంబలే ఫిల్మ్స్ మిస్ చేయడం లేదు. తాజాగా సలార్ టికెట్లు ధరలు పెంచుకోవడం కోసం..అదనపు షో అనుమతులు కోసం ముందస్తు గానే పావులు కదుపుతున్నట్లు సమాచారం.
అప్పుడే అన్నిరకాల అనుమతులు కోసం ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించే పనిలో పడ్డట్లు వినిపిస్తుంది. టికెట్ ధరని 50 నుంచి 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పించేలా..ఐదు షోలు అనుమతులు వచ్చేలా ప్రభుత్వాలకు విన్నవించుకున్నట్లు వినిపిస్తుంది. అధికారుల నుంచి సానుకూలంగా స్పందన వచ్చే అవకాశం ఉంది. అసలే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు.
నిర్మాతలు.. పంపిణీ దారులు కోరుకున్నట్లు అన్నిరకాల వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉంది. `సలార్` ఇలా ముందొస్తుగా వెళ్లడానికి ఓ కారణం ప్రధానంగా కనిపిస్తుంది. రిలీజ్ కి వారం ముందుగా వెళ్లి అధికారుల్ని ఇబ్బంది పెట్టేకంటే ముందుగానే కర్చీప్ వేస్తే అప్పటికి పని ఈజీ అవుతుందన్నది ఓకారణ మైతే..ఎన్నికల సమయం కాబట్టి అధికారులంతా హడావుడిగా ఉంటారు. సినిమాని పట్టించుకు నేంత సమయం ఉండుదు. ఆ రకంగానూ కొంత జాప్యానికి అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే అన్నిచోట్ల దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.