Begin typing your search above and press return to search.

సలార్ ఢీకొట్టిన ఆ ఖాన్సార్.. బాలీవుడ్ దేనా?

కాగా, సలార్ లో చూపించిన "కాన్సార్" సామ్రాజ్యం అంటే ఏమిటో కాదని.. బాలీవుడ్ ఖాన్ దాన్ ను పరోక్షంగా ప్రస్తావించారని కొందరు చెప్పుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 2:30 PM GMT
సలార్ ఢీకొట్టిన  ఆ ఖాన్సార్.. బాలీవుడ్ దేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రూపకర్త ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన సలార్ హిట్ టాక్ అందుకుంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రభాస్ కటౌట్ కు సరిగ్గా సరిపోయేలా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ను మళ్లీ ఫుల్ యాక్షన్ మోడ్ లో చూపించడమే సలార్ విజయ రహస్యంగా చెబుతున్నారు. వాస్తవానికి బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాల్లో "సాహో" మంచి పేరే తెచ్చుకుంది. అయితే, ఆ సినిమాకు బాలీవుడ్ లో వచ్చిన పేరు మిగతా ఇండస్ట్రీల్లో రాలేదు. కాగా, హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రభాస్ స్టామినా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండడం గమనార్హం.

మళ్లీ పాత ప్రభాస్

ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లో చూస్తేనే అభిమానులకు సాధారణ ప్రేక్షకులకు మనసు నిండుతుంది. ఆ లోటును బాహుబలి తర్వాత పూర్తిగా తీర్చినందునే సలార్ కు హిట్ టాక్ దక్కిందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. యష్ స్థానంలో ప్రభాస్ ను ఉంచి "కేజీఎఫ్ 3"ని తీసినట్లుందని.. అదరగొట్టే యాక్షన్ సీన్లతో.. ప్రశాంత్ నీల్ మునుపటి సినిమాల్లాగే గ్రిప్ సడలకుండా పిక్చరైజ్ చేశారని పేర్కొంటున్నారు. దీంతోపాటు ప్రభాస్ ఎలివేషన్ హై లెవల్ లో ఉండడంతో "సలార్" నిలదొక్కుకున్నట్లేనని వివరిస్తున్నారు.

ఆ "ఖాన్"సార్ టార్గెట్?

బాలీవుడ్ లో ముప్పై ఏళ్లుగా షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లదే హవా. 2000 తర్వాత హ్రతిక్ రోషన్ వచ్చి కాస్త అడ్డుకట్ట వేసినా.. మళ్లీ ఖాన్ త్రయం పుంజుకొంది. అయితే, వారి 'ఖాన్'దాన్ ను ఢీకొట్టే వారు ఎవరా? అని ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ బాహుబలిలా కనిపించాడు. అయితే, సాహో కాస్త దగ్గరగా వచ్చినా.. ఆదిపురుష్ సహా ప్రభాస్ తర్వాతి సినిమాలన్నీ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ప్రభాస్.. మళ్లీ దీటుగా నిలిచాడనే విశ్లేషణలు వస్తున్నాయి. కాగా, సలార్ లో చూపించిన "కాన్సార్" సామ్రాజ్యం అంటే ఏమిటో కాదని.. బాలీవుడ్ ఖాన్ దాన్ ను పరోక్షంగా ప్రస్తావించారని కొందరు చెప్పుకొస్తున్నారు.

కొసమెరుపు: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చాన్నాళ్ల తర్వాత సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించిన సినిమా డంకీ... ఈ సినిమా సలార్ కంటే ఒక్క రోజు ముందే గురువారం నాడు రిలీజైంది. సాఫ్ట్ సినిమా కావడం.. షారూఖ్ ను చాలా కాలం అనంతరం తనదైన శైలి పాత్రలో చూడడంతో డంకీకీ పాస్ మార్కులే పడ్డాయి. కాకపోతే.. సలార్ వంటి పక్కా యాక్షన్ సినిమా ముందు డంకీ ఎంతమాత్రం నిలుస్తుందో చూడాలి. ఒకవేళ సలార్ ను తట్టుకోలేక డంకీ గనుక డిమ్కీ కొడితే అదో పెద్ద సంచలనమే కానుంది. ప్రభాస్.. "ఖాన్సార్"ను బద్దలు కొట్టినట్లే అవుతుంది.